ఏపీ ప్రభుత్వం పశువులకు కూడా ఆధార్ సౌకర్యం కల్పించనుంది. పశుసంవర్థకశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్నమైన ప్రయోగం చేపట్టింది. ఆధార్ గుర్తింపు సంఖ్యను కేంద్రం సహాయంతో పశు సంవర్థక శాఖ ఇవ్వబోతున్నది. పశు సంవర్థక శాఖ అధికారులు నోడల్ ఏజెన్సీ సహాయంతో పశువులకు ఆధార్ ట్యాగ్ వేస్తున్నారు. పశువులకు ఆధార్ ట్యాగ్ వేయటం ద్వారా ఆన్ లైన్ ట్రేడింగ్ జరుపుకోవచ్చు. 
 
ఈ ట్యాగ్ ద్వారా దేశంలో ఎక్కడినుండైనా పశువుల వ్యాపారం చేసుకునే వీలు ఉంటుంది. పశువులకు ఆధార్ కేటాయించటం వలన రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని అధికారులు చెబుతున్నారు. అధికారులు పశువుల చెవుల దగ్గర ఆధార్ నంబర్ ఈనాఫ్ ట్యాగ్ ను వేస్తారు. పశువులకు ఆధార్ ట్యాగ్ వేయటం వలన పశువులకు ఎద ఇంజక్షన్లు ఎప్పుడు ఇవ్వాలి? పాలు, జబ్బులు, ఇతర వివరాలు అధికారులు ఆన్ లైన్ లో ఈనాఫ్ యాప్ లో నమోదు చేస్తారు. 
 
పశువులకు ఆధార్ ట్యాగ్ వేయటం ద్వారా దొంగతనాలను కూడా నివారించవచ్చు. పశువులు తప్పిపోతే పట్టుకోవడం ప్రస్తుతం చాలా కష్టమవుతోంది. కొంతమంది పశువులను అపహరించి దొంగతనం చేసి సంతలో అమ్మిన ఘటనలు కూడా ఉన్నాయి. పశువులకు ఆధార్ ట్యాగ్ వేయటం వలన పశువులు తప్పిపోయినా ఆధార్ నంబర్ ద్వారా పశువుల యజమాని ఎవరో సులభంగా కనిపెట్టవచ్చు. 
 
రైతులు పశువులకు ఆధార్ తీసుకోకపోతే ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను కోల్పోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో అధార్ నమోదు చేసిన పాడి పశువులకు అధికారులు ఆరోగ్య కార్డులను కూడా అందిస్తారు. ప్రతి పునరుత్పత్తి కలిగిన గేదెలు, ఆవులకు 12 అంకెల యూనిక్ నంబర్ ను కేటాయిస్తారు. నోడల్ ఏజెన్సీకి పశు సంవర్థక శాఖ అధికారులు ఆధార్ నంబర్ కేటాయించటానికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా పశువులకు ఆధార్ ట్యాగ్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే చాలా పశువులకు ఆధార్ నంబర్ కేటాయించి ట్యాగ్స్ వేసినట్లు తెలుస్తోంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: