తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. డెంగ్యూ వ్యాధితో నగరాలు, పట్టణాలు, పల్లెల్లో కూడా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. పల్లెలు, పట్టణాలలో వర్షాలు కురవటంతో డెంగ్యూ వ్యాధి విజృభింస్తోంది. మురికి ప్రాంతాలు, ఇంటి పరసరాలలో చెత్త పేరుకుపోయిన చోట డెంగ్యూ వ్యాప్తికి కారణమయ్యే దోమలు ఎక్కువగా ఆవాసం చేస్తాయి. డెంగ్యూ వ్యాప్తికి కారణమయ్యే దోమలు కుట్టిన వారం రోజులలోపే వ్యాధి లక్షణాలు బయటపడతాయి. 
 
ఈ దోమలు కేవలం పగలు మాత్రమే కుడతాయి. ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధి మరణాల సంఖ్య కూడా గతంతో పోలిస్తే  పెరిగింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 8,117 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6,685 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని సమాచారం. హైదరాబాద్ నగరంలోనే 2,100 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. గడచిన వారం రోజుల్లో 620 మందికి కొత్తగా డెంగ్యూ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. 
 
గాంధీ వైద్యులు అధికారిక లెక్కల ప్రకారం 137 కేసులు నమోదు అయ్యాయని చెబుతున్నారు. డెంగ్యూ వ్యాధి వచ్చినవారు బెడ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినవారిలో ప్లేట్ లెట్స్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఈ వ్యాధి వచ్చినవారిలో చిన్నారులు ఎక్కువమంది ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో డెంగ్యూ వ్యాధితో చేరిన వారు సరైన వైద్యం అందటం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. 
 
డెంగ్యూ వ్యాధి ఒకవైపు నుండి నివారించుకుంటూ వస్తోంటే మరోవైపు నుండి ప్రబలుతోంది. డెంగ్యూ విజృంభణతో దోమకాటుకు గురవుతున్న వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. డెంగ్యూ వ్యాధి దోమలను టైగర్ దోమలు అని కూడా అంటారు. ప్రజలు దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో డెంగ్యూ వ్యాధి వచ్చిన వారి సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: