ఆంధ్ర ప్రదేశ్లో రాజధాని అంతా ఒక చోట ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి బాగా అవుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి అని గుంటూరు లోక్ సభ సభ్యుడు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గల్లా జయదేవ్ తెలియచేశారు. మంగళగిరి టిడిపి కార్యాలయంలో గల్లా జయదేవ్  మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులతో కలిసిన అప్పుడు  ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారని, మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఎంతో గానో బాగుండేదని అయినా అభిప్రాయాన్ని తెలియచేయడం జరిగింది.


 ఇక ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి 600 అవార్డులు కేంద్రం నుంచి లభించడం జరిగింది అని అయినా తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలకు పార్టీ గొప్పదనం తెలుసు అని తెలియచేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధికి నిధులు కూడా లభించడం జరిగింది. విశాఖ, కాకినాడ, అనంతపురం వంటి ప్రాంతాల్లోనూ నిధులు ఖర్చు చేసి అభివృద్ధి కూడా చేయడం జరిగింది  అని జయదేవ్ తెలియచేశారు. రాజధానిలో అనుసంధాన రహదారులకే రూ.9వేల కోట్లు పెట్టినట్లు తెలియచేసాడు. అభివృద్ధి అనేది ఆర్థికపరమైన వెంచర్స్, రాజధాని కేంద్రంలోనే ఉండాలని అయినా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


ఇందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి మహానగరలు ఉదాహరణలని తెలిపారు. ప్రస్తుతం మనం వెనుకబడి పోతున్నాము,  అభివృద్ధికి భవిష్యత్తు బాగా  ఉండాలంటే మనకు రాజధాని ఉండాలి అని తెలిపారు. వైసిపి పాలన వల్ల పొరుగు రాష్ట్రాలకు ఇసుక లభించడం జరుగుతుంది. వైసిపి అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం లేదు అని తెలిపారు. ఇక కొత్త  ఇసుక విధానం ఐతే ఆ పార్టీ నేతల జేబులు నింపుతోందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించడం జరిగింది.


 గుంటూరులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...మన రాష్ట్రంలో దొరకని ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలి పోవడం జరుగుతుంది అని తెలిపారు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1200 ఉంటే ఇప్పుడు రూ.1వేల నుంచి రూ.10 వేలు వరుకు పెరిగింది అని తెలియచేశారు. ఇక లారీ ఇసుక ఐతే ఏకంగా రూ.40వేల నుంచి రూ.లక్షకు అమ్ముతున్నారు అని తెలిపారు. ఐనా కూడా  ఎందుకు పట్టించుకోవడం లేదు అని రాజేంద్రప్రసాద్ ప్రశ్న వేయడం జరిగింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 25న ప్రదర్శనలు నిర్వహించనున్నామని  రాజేంద్రప్రసాద్  తెలియచేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: