ఒంగోలు నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాల పాటు నాతో ప్రయాణం చేసే నాయకులు కావాలని అన్నారు. డబ్బు అవసరం లేని, డబ్బు పంచని స్థాయికి రాజకీయాలను తీసుకొనివెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశంలోని భావజాలం అర్థం చేసుకున్నవాడినని పవన్ అన్నారు. గెలుపే ముఖ్యం అనుకుంటే వంద వ్యూహాలు పన్నేవాడినని పవన్ చెప్పారు. 
 
జనసేన పార్టీని అంతిమ శ్వాస వరకు నడుపుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను మనుషులకు చాలా గౌరవం ఇస్తాను. మనుషుల్లోని నాయకుల మానవత్వాన్ని చూస్తానని అన్నారు. నేను చాలా జాతీయ భావాలతో పెరిగినవాడినని అన్నారు. మన కంటే దేశం గొప్పదని పవన్ అన్నారు. మన మీద కేసులున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ధైర్యం సరిపోదని జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
కేసులు ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులైతే ఎంత న్యాయం జరుగుతుందని సందేహించాల్సి వస్తుందని పవన్ అన్నారు. నాకు జగన్, చంద్రబాబుతో వ్యక్తిగతంగా విబేధాలు ఉండవని అన్నారు. ఈరోజు వైసీపీ పార్టీ అధికారంలో ఉందని వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ జరిపి దోషులను ఎందుకు పట్టుకోలేదని పవన్ ప్రశ్నించారు. కోడి కత్తి కేసు గురించి కూడా పవన్ జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. 
 
నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి  ఒక మహిళా అధికారిపై దాడి చేశారని పవన్ అన్నారు. నేను పిరికితనంతో బ్రతకనని పవన్ కళ్యాణ్ అన్నారు. చనిపోయే సమయంలో మాత్రం ధైర్యంగా చనిపోతానని అన్నారు. ఎవరైతే నిస్వార్థంగా జనసేన పార్టీలో ఉంటారో వారు చివరివరకు పార్టీలో ఉంటారని పవన్ అన్నారు. జనసేనకు మొదటి ఎన్నికల్లోనే దాదాపు 7 శాతం ఓట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే భయపడే వ్యక్తిని కానని పవన్ అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: