హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో అధికార టీఆరెస్ విజయం సాధిస్తే ,   రాష్ట్రంలో వెంటనే మున్సిపల్  ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి . హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో గెలుపు జోష్ ను సద్వినియోగం చేసుకుని  మున్సిపల్ ఎన్నికల్లోను  తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని అధికార టీఆరెస్ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆయా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు హుజూర్ నగర్  ఉప ఎన్నికలో గెలుపు తమదేనని ధీమాగా ఉన్న  ముఖ్యమంత్రి కేసీఆర్,  మున్సిపల్ ఎన్నికలకు రెడీ గా ఉండాలని అధికారులను ఆదేశించారు .


 మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానం లో పిటిషన్లను దాఖలు చేయగా , విచారించిన హైకోర్టు వారి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ , ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . దీనితో మున్సిపల్  ఎన్నికల నిర్వహణ కు  రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది . అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం పైనే, రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడనేది ఆధారపడి ఉంటుందని   రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . ఒకవేళ హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి విజయం సాధిస్తే , మున్సిపల్ ఎన్నికల నిర్వహణ లో ప్రభుత్వం కొంతజాప్యం చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు .


 అదే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై  హుజూర్ నగర్ ఉప ఎన్నిక లో టీఆరెస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధిస్తే , మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం వారం, 15  రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చునని అంటున్నారు . టీఆరెస్ సర్కార్ అనుమతిచ్చిన వెంటనే ఎన్నికల సంఘం (ఈసీ ) నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు . వచ్చే నెల మొదటివారం లో మున్సిపల్ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ప్రకటించవచ్చునని చెబుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: