తెలంగాణ  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్  సర్కార్ ను  ఇరుకున పెట్టే ప్రతిపాదనను చేసింది .   గిరిజన గ్రామాల్లో, తండాల్లో  పల్లెనిద్ర చేయాలని ఆమె భావిస్తున్నారు. గవర్నర్ పల్లె నిద్ర చేస్తే , ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న వాదనలు విన్పిస్తున్నాయి . ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు  ప్రజలను కలుసుకోవడం లేదని , సెక్రటేరియట్ కు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తోన్న నేపధ్యం తమిళి సై చేసిన తాజా ప్రతిపాదన అధికార పార్టీ వర్గాలను ఆందోళన కు గురి చేస్తోంది .


  గిరిజన శాఖతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో తమిళిసై మాట్లాడుతూ  తాను వైద్యాధికారి గా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లాలని చెప్పింది . అక్కడే ఉంటూ  వారికి వైద్య సేవలు అందించానని వెల్లడించింది  .  గిరిజనుల మధ్య ఉంటూ వారి సంస్కృతి,  సమస్యలను అర్థం చేసుకున్నప్పుడే, వారి సమస్యల  సరైన పరిష్కారం  అందించగలుగుతామని  అన్నారు . తెలంగాణ గవర్నర్ గా  తమిళిసై  పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు . ఇటీవల విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు , ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె , కేంద్రం మంజూరు చేస్తోన్న నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని ఆదేశించింది .


గతంలో  తెలంగాణ గవర్నర్ గా  పనిచేసిన నరసింహన్  సమీక్షా  సమావేశాలు నిర్వహించగా పెద్దగా ఆందోళన చెందని ముఖ్యమంత్రి కేసీఆర్,  తమిళిసై సమీక్షా  సమావేశాలు నిర్వహిస్తుంటే మాత్రం ఆందోళన చెందుతున్నట్లు కన్పిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .  తాజాగా ఆర్టీసి సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి ఫోన్ చేసి  మాట్లాడిన తమిళి సై , రవాణా శాఖ అధికారులను పిలిపించుకుని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.  తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమ్మె ను  పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: