మాజీ సీఎం చంద్రబాబు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నారని వైసీపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది. ఇప్పుడు మరో షాకింగ్ ఆరోపణ చేస్తోంది. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు కుప్పం కాల్వ పనులకు అంచనాలు పెంచి, అదనపు చెల్లింపులు చేశారంటోంది. సొంత నియోజవర్గంలో పనుల్లో కూడా అవినీతి కక్కుర్తేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు కుప్పం వాసులు అని చెబుతోంది.


ఈపీసీ ద్వారా రూ.430.26 కోట్ల పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు 123.641 కిలోమీటర్ల కాలవ తవ్వకం పనులు చేయాల్సి ఉందట. కానీ ఇంతవరకూ అవి పూర్తి కాలేదట.కాంట్రాక్టులో భాగంగా 324 స్ట్రక్చర్స్ 5 చోట్ల, ఎన్‌ హెచ్ క్రాసింగ్ పనులు 3 చోట్ల, ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేయాలి. దీంతో 110 చెరువులకు నీరు అందించే పనులు 9 నెలల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టులో ఉంది. అయితే ఆ పనులు ఇవాల్టీకీ పూర్తి కాలేదు.


పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో అధికమొత్తానికి కాంట్రాక్టులు కట్టబెట్టి, ఖజానాకు వందల కోట్ల నష్టం తెచ్చారట. సోమవారం దీనిపై విజిలెన్సు అధికారులు, ఎన్‌ ఫక్షర్సుమెంట్ డిప్యూటీ ఇంజనీర్లు, జేఈలు తనిఖీలు చేసారు. కాల్వ పనులను పరిశీలించి నివేదక సిద్ధం చేస్తున్నారు. ఇందులో అవకతవకలు బయటపడితే బాబుకు ఇక్కట్లు తప్పవని వైకాపా నేతలు అంటున్నారు.


ఈ కథనం వైసీపీ సోషల్ మీడియా సర్కిళ్లో తెగ తిరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తేలాల్సిఉంది. ఏది ఏమైనా కుప్పం అంటే ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబే.. తమిళనాడు సరిహద్దుల్లో ఓ మూలన ఉండే నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకోవడం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. వరుసగా అక్కడి నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. అలాంటి చోట కూడా టీడీపీ నేతలు కక్కుర్తి పడ్డారన్నది ఈ కథనం సారాంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: