ఆయనో ప్రొఫెసర్. అంతకుమించి సమాజంపట్ల తాపత్రయం ఉన్నవాడు.. తన ప్రాంతం గురవుతున్న వివక్షపై విద్యావంతులను ఏకం చేసినవాడు.. మొదట విద్యావంతుల వేదిక పేరుతో ఓ సంఘం పెట్టి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చకు పెట్టాడు. ఆయనే ప్రొఫెసర్ కోదండరాం.

సాత్వికంగా.. అమాయకంగా కనిపించే.. ఈ ప్రొఫెసర్ కీలక సమయంలో తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపై నడిపాడు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలను ఏకంచేసి.. తెలంగాణ ఉద్యమాన్ని భుజానవేసుకున్నాడు. ఓ దశలో కేసీఆర్ వెనక్కుతగ్గి.. వ్యూహాత్మక మౌనం పాటించి ఉద్యమ వేడి చల్లార్చినా.. ఆలోటను సమర్థంగా భర్తీ చేశాడు.

ఐతే.. ధర్నాలు, రాస్తారోకోలు జరిపినా.. తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగానే నిర్వహించాడు కోదండరామ్. ట్యాంక్ బండ్ విధ్వంసం తప్పితే.. తెలంగాణ ఉద్యమం దారి తప్పిన ఆనవాళ్లు అంతగా కనిపించవు. టీఆర్ఎస్ కలసిరాకపోయినా.. పార్టీలకు అతీతంగా సాగరహరం వంటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించి కేసీఆర్ కే వణుకుపుట్టించాడని చెప్పుకోవచ్చు.

అందుకేనేమో.. వరంగల్ లోని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతి ఏటా ప్రకటించే శాంతిదూత అవార్డును ఈసారి కోదండరామ్ కు ఇచ్చింది. 2014 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్రం వర్గంలో ప్రొఫెసర్ కోదండరాంను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడకు చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్‌రావును శాంతిదూతగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: