బాలీవుడ్ లో కపూర్ వంశానికి పెద్ద పేరే ఉంది. పృథ్వీరాజ్ కపూర్ భారతీయ థియేటర్ ఆద్యుడు మరియు హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు, ఇతని ఐదు తరాలు హిందీ సినిమా రంగం(బాలీవుడ్)లో నటించాయి. ఎనబై దశకంలో వీరి మనవడు రిషీ కపూర్ బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగొందిన హీరో రిషి కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు.

ఈ మధ్య ఆవు మాంసంపై నిషేదాంక్షలు పెట్టిన విషయం తెలిసిందే.. గోవధను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇకమీదట రాష్ట్రంలో ఎక్కడైనా ఆవు మాంసాన్ని విక్రయించిన లేదా కలిగి ఉన్నా వాళ్లకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50 వేల రూపాయల జరిమానా విధించనున్నారు.

అప్పటి నుంచి బాలీవుడ్ రంగానికి చెందిన కొందరు ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో రిషీ కపూర్ తినే తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారో తనకి అర్ధం కావడం లేదన్నారు. ఆవు మాంసం తినే హిందువునని ఆయన ప్రకటించుకున్నారు. కాగా రిషీ కపూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లెపాయి.

ఆయనపై పెద్ద ఎత్తు విమర్శలు చేశారు. వాటికి సమాధానాలు ఇవ్వలేక రిషి కపూర్ ఇబ్బందులు పడుతున్నారు. "నా మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను ఆవులను చంపానని ఎప్పుడు చెప్పాను? నేను ఆవు మాంసం తింటాను. ఇండియాలో కాదు. దాన్ని ఆహారంగా వినియోగించే చోట" అని వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: