వన్డే వరల్డ్  కప్ 2015 ఫైనల్లో ఆతిథ్య జట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గేమ్ లో  టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.       న్యూజిలాండ్ ఓపెనర్‌గా రంగంలోకి దిగిన కెప్టెన్ మెక్కల్లమ్ డక్ ఔట్ కావడం విశేషం. మొదటి ఓవర్లోని నాలుగో బంతికి ఆస్ట్రేలియాన్ బౌలర్ స్టార్క్ వేసిన బంతికి మెక్కల్లమ్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. మెక్‌కల్లమ్‌, గుప్తిల్‌ ఒకరి తర్వాత ఒకరు వెంటవెంటనే ఔటైపోవడంతో న్యూజిలాండ్‌ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆ జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది.


వికెట్ పడిపోవడంతో వెన్కి తిరిగి చూస్తున్న మెక్‌కల్లమ్‌


పేస్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆసీస్ కు మెరుగైన రికార్డు ఉంది. న్యూజిలాండ్‌ను కట్టడి చేస్తామని ఆసీస్ జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పేర్కొన్నాడు. లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వాసంతో మరోసారి ఆ దేశంపై గెలిచి తొలి వరల్డ్ కప్ గెలవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.

జట్ల వివరాలు: 

ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్, స్టీవెన్ స్మిత్, క్లార్క్, వాట్సన్, మాక్స్‌వెల్, హడిన్, ఫాల్క్‌నర్, జాన్సన్, స్టార్క్, హేజిల్‌వుడ్.

న్యూజిలాండ్: బ్రెండన్ మెక్‌కలమ్, గప్తిల్, విలియమ్సన్, రాస్ టేలర్, ఇలియట్, అండర్సన్, రాంకి, వెటోరి, సౌథీ, బౌల్ట్, హెన్రీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: