జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే జగన్ కదలికలపై కోర్టు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. జగన్ ఎక్కడకు పడితే అక్కడకు వెళ్లడానికి వీళ్లేదు. రాష్ట్రం దాటి పోవాలంటే కచ్చితంగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే.

తానో రాజకీయ పార్టీ అధ్యక్షుడినని తనకు కొన్ని మినహాయింపులు కావాలని జగన్ ఎప్పటి నుంచో సీబీఐ కోర్టును కోరుతున్నారు. తాజాగా ఆయన సీబీఐ కోర్టును మరో కోరిక కోరారు. జగన్, ఆయన కుటుంబం క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న సంగతి తెలిసిందే. క్రైస్తవులు పవిత్రంగా భావించే జెరూసలేం వెళ్లాలని జగన్ కోరుకుంటున్నారు. 

అక్రమాస్తుల కేసులో జగన్ తన పాస్ పోర్టును సీబీఐ కోర్టుకు సమర్పించారు. అందుకే కుటుంబంతో పాటు జెరూసలేం వెళ్లాల్సి ఉందని.. తన పాస్ పోర్టు తనకు ఇప్పించాలని కోరుతూ జగన్ కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు.  జూన్, జులై నెలల్లో పదిహేను రోజుల పాటు.. కుటుంబంతో జెరూసలెం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

జెరూసలేం యాత్ర కోసం తాను వీసా పొందాలని... తన పాస్ పోర్టు గడువు కూడా ముగిసినందున రెన్యువల్ చేసుకోవాలని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను సీబీఐ కోర్టు విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది. మరి జెరూసలేం యాత్ర కోసం జగన్ కు అనుమతి దొరుకుతుందో లేదో..? 


మరింత సమాచారం తెలుసుకోండి: