స్థాన బలిమి కాని.. తన బలిమి కాదయా.. అంటాడు వేమన శతకకారుడు.. తమ తమ స్వస్థలంలో ఉన్న వారికి ఆ ప్రాంత బలం ఉంటుంది. నీళ్లలో తెగ రెచ్చిపోయే మొసలి.. బయటకు రాగానే బలం కోల్పోతుంది. 

మరి అలాంటింది.. నీళ్లలోని ఓ జంతువును.. నేలపై తిరుగాడే పిల్లి సతాయించగలదా.. అంటే కష్టమే అని చెప్పొచ్చు. కానీ ఓ పిల్లి ఎలా ట్రై చేసిందో ఏమో కానీ..  సముద్రంలోని షార్క్ ను తోక పుచ్చుకుని బయటకు లాక్కొచ్చేసింది.  

ఈ అరుదైన దృశ్యం.. అమెరికా ఫ్లోరిడా తీరంలో ఓ కెమేరామెన్ కంటికి చిక్కింది. ఓ గండు పిల్లి సముద్రంలో దూకడం చూసిన ఆ కెమేరామెన్ అలర్టయ్యాడు. ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూశాడు. తీరా చూస్తే.. ఆ పిల్లి ఏకంగా షార్క్ ను నోట కరచుకుని తెచ్చేసింది. 

ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ఇదో సెన్సేషన్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: