ఈ రోజుల్లో మనిషి తన కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకోవడం కష్టమే అయ్యింది. బయట జరిగే పనుల వత్తిడి తో ఇంట్లో వాళ్లపై చూపించడం పరిపాటైంది.  మానసిక వత్తిడికి మనిషి ఎలాంటి ఉన్మాదిగా దారితీస్తుందో అన్న భయాందోళనలో ప్రతి ఒక్కరూ ఉన్నారంటూ మానసిక నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  


మృతురాలు రీతు 


ఇటీవల హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మరణించిన మాజీ ఎయిర్‌హోస్టెస్ రీతూ ఉప్పల్ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈమెను హత్య చేసింది కట్టుకున్న భర్తేనని తేల్చేశారు. ఈ మేరకు అతను నేరాన్ని అంగీకరించినట్టు వెల్లడించారు.భార్య రీతు, భర్త సచిన్ మధ్య ఆ రోజు రిమోట్ కోసం గొడవ జరిగింది. ఆ గొడవ కూడా భర్త స్నేహితుడు రాకేష్ ముందు జరిగింది. తన స్నేహితుడి ముందు తన భార్య తనను అవమానించిందనే ఆగ్రహంతో రీతును భరత్ హత్య చేశాడని తెలుస్తోంది.  


రీతు బంధువుల రోదన, పాపతో రీతూ


రీతూను హత్య చేసే సమయంలో స్నేహితుడు రాకేష్‌ ఆపే ప్రయత్నం కూడా చేయకపోవడంతో పోలీసులు రాకేష్‌పైనా కేసు నమోదు చేశారు. సచిన్‌పై 302, 303, 304 సెక్షన్ల కింద, రాకేష్‌పై 304, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇరువురిని రిమాండ్‌కు తరలించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: