దేశం మునుపెన్నడూ లేని రీతిలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే ప్రధాని మన్మోహన్ సింగ్కు ఏ మాత్రం పట్టింపు లేదని, ఆయన పని చేయని ప్రధాని అని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి, సిపిఐ పార్లమెంటరీ పార్టీ నాయకులు గురుదాస్ దాస్ గుప్తా తీవ్ర విమర్శ చేశారు. ప్రభుత్వ విధానాలను కేవలం పార్లమెంటు లోపల చర్చల ద్వారా మార్చలేమని, బైట ప్రజలు వీధుల్లోకి వచ్చి ఐక్యపోరాటాలు చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు ఆదేశాలతో నడుస్తుందని, అమెరికా అధ్యక్షుడు ఒబాడు డిమాండ్ లకు తలొగ్గిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా ఆయన బుధవారం నాడు ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటుందని, వృద్ధిరేటు 9 శాతం నుండి 5 శాతానికి పడిపోయిందన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి 1 శాతం కంటే తక్కువగా ఉందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, డాలర్ తో రూపాయి విలువ తరిగిపోతూ రూ. 56-రూ.57 మధ్య కొట్టుమిట్టాడుతుందని, ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతూనే ఉందని వివరించారు. మరోవైపు విదేశీ నిధులు తరలిపోతున్నాని, అంతర్జాతియ రేటింగ్స్ లో భారత్ స్థానం పడిపోయిందని చెప్పారు. తీవ్రమైన ఆర్థక సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతుంటే ప్రధాని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థీతులపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని చెప్పడం మినహా సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రధాని ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు సంక్షేమ పథకాలకు నిధులను తగ్గించాలని, పెట్రోలు, డీజిల్, వంటగ్యాసుల ధరలు పెంచాలని, సబ్సిడీలపై కోత విధించాలని ప్రభుత్వ సలహాదారులు తిరోగమన సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. ఇదిలాఉండగా, దేశంలో సంక్షేమ పథకాలకు నిధులను కత్తిరించి, పశ్చిమదేశాలను సంక్షోభం నుంచి బైటపడేసేందుకు మన దేశం ప్రపంచబ్యాంకుకు 5 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటిండం విడ్డూరంగా ఉందన్నారు. దిగజారుతున్న సామాన్యుల బతుకుల గురించి ప్రభుత్వానికి పట్టడం లేదని, ఇది ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పాలకుల దవాళాకోరుతనం, నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తున్నాయని, వాటిని మార్చాలంటే కేవలం పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తే సరిపోదని, వెలుపల దేశవ్యాప్తంగా ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని గురుదాస్ దాస్ గుప్తా కోరారు. ఈసారి పార్లమెంటు సమావేశమవగానే ఆర్థిక సంక్షోభం పై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కోరతామన్నారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు సామాజికరంగాలు, సామాజికరంగాలు, సామాజిక మౌలికసదుపాయాల కల్పన రంగాలకు నిధులు కేటాయించాలన్నారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, మన సరుకులకు దేశీయ డిమాండ్ ను పెంచాలని, ఫంచాలని, విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ప్రధానంగా బ్లాక్ మార్కెటీర్లపై దాడులు పెంచాలని, రేషన్ సరుకులపై మరింత సబ్సిడీ ఇవ్వాలని, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. అంతర్జాతీయ ముడి చమురుమ ధర పెరుగుతున్నప్పటికీ, ప్రపంచంలోనే మన దేశంలో పెట్రో ఉత్సతలపై విధిస్తున్న పన్నులను తగ్గించడం ద్వారా ధరలను నియంత్రంచాలన్నారు. పన్నుల తగ్గింపుతో ప్రభుత్వ ఆదాయంలో లోటును ఆదాయపన్నుకట్టే సామర్థ్యం ఉన్న వారికి పన్నులు పెంచడం ద్వారా, పన్ను ఎగవేతలను అరికట్టడం ద్వారా పూడ్చుకోవాలని సూచించారు. దీనికి తోడు అక్రమ సంపాదన, బ్లాక్ మనీపై నియంత్రణ పెంచాలన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ కించపరుస్తుంది ప్రజల గురించి పట్టించుకోనందునే ఆంధ్రప్రదేశ్ లో అధికార కాంగ్రస్ పార్టీ వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని గురుదాస్ అన్నారు. అయినప్పటికీ ఎందుకు ఓడిపోతున్నామనే అంశంపై సరైన ఆత్మపరిశీలన ఆ పార్టీలో జరగడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను వ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వలసరాజ్యంగా మార్చిందని, ఇక్కడి ప్రజలు ఆత్మగౌరవాన్ని కించాపచిందని, అందుకే ఆ పార్టీ ఓడిపోయిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పజల భవిష్యత్తును ప్రజలు నిర్దేశించుకుంటారే తప్ప జన్ పథ్ – 10( సోనియాగాంధీ నివాసం) కాదన్నారు. విలేకరుల సమావేశంలో ఎఐటియసి రాష్ట్ర అధ్యక్షులు పి.జె.చంద్రశేఖర్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షులు టి.నరసింహన్, ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఉపప్రధాన కార్యదర్శ బాల్ రాజ్లు పాల్గొన్నారు. రెండు రోజుల సమ్మె దేశంలో 18 నెలలుగా ఐక్యంగా ఆందోళన చేస్తున్న కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో చర్చించేందుకు ప్రధాని మన్మోహన్ కు తీదని, పన్ను ఎగవేతదారుడైన కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యాను మాట్లాడేందుకు మాత్రం సమయమిచ్చారని గురుదాస్ విమర్శించారు. ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు మరోసారి కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 11న కేంద్ర కార్మక సంఘాలు ఢీల్లీ భేటీ కానున్నాయని, ఈసారి రెండు రోజుల జాతీయ సార్వత్రిక సమ్మె, శాసనోల్లంఘణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నామన్నారు. కార్మికులు ఐక్య పోరాటాలను మరింత మిలింటెంట్ స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుపై వేసిన జెసిన ఎదుట ప్రధానిని పిలవకూడదని నిర్ణయించినట్లు వచ్చిన వార్తలను ఆయను ఖండించారు. ఈ అంశం పై అడిగిర ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ జెపిసి ఎదుట ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు అనే జాబితాను ఇంకా తయారు చేయలేదని, ఈనెల 10న జరిగే జెపిసి భేటీలో తుది జాబితా ఖరారవుతుందని జెపిసి సభ్యుడైన గురుదాస్ దాస్ గుప్తా వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: