గత కొంత కాలంగా ఉత్కంఠంగా సాగిన జయలలిత అక్రమార్కుల  కేసు నేటితో ముగిసింది. అన్నాడీ ఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీ ఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.  ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు.



పోలీస్ కస్టడీ లో ఉన్నపుడు జయలలిత.


తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని మేలిమి బంగారంగా బయట పడ్డానన్నారు. కాగా, అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని స్పెషల్ కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.  అమ్మ కోసం ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే పూజలు ఆరంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరిగాయి. ఎట్టకేలకు ‘అమ్మ’ మళ్లీ ముఖ్యమంత్రి కానుండటంతో.. తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు.


తమిళనాడు లో సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు



హైకోర్టు తీర్పులో కీలకాంశాలు

జయలలిత అక్రమాస్తులు సంపాదించినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది.

జయలలిత, ఇతర నిందితులు తాము ఎలా సంపాదించామనే వివరాలు వెల్లడించారు

నిందితుల సంపాదన వివరాలకు సంబంధిచిన ఆధారాలు సంతృప్తికరం

అక్రమాస్తులు ఎలా సంపాదించారనే దాని పైన ప్రాసిక్యూషన్ వివరాలు సంతృప్తికరంగా లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: