ఆసియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ జిల్లాగా పిలవబడే కామాథిపూరా ప్రాంతపు సెక్స్ వర్కర్లు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా  కొనసాగించడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.  ముంబై అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది రెడ్ లైట్ ఏరియా ఎందుకంటే ఆ ఏరియా అంత ఫేమస్ అయింది. సెక్స్ వర్కర్ల కార్యకలాపాలు శృతిమించుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు.


రెడ్ లైట్ ఏరియాల్ సెక్స్ వర్కర్లు


సెక్స్ వర్కర్ల వలన తమ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే వారిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా నివాసం ఉంటున్న రెండు వేల కుటుంబాలకు చెందినవారు ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాలకు లేఖలు రాశారు. ఆ సెక్స్ వర్కర్లను వేరే చోటకు తరలించాలని రెండు వేల మందికి పైగా స్థానికులు వినతి పత్రాలు సమర్పించారు.


 కామాథిపూరా ప్రాంతపు సెక్స్ వర్కర్లు


సెక్స్ వర్కర్ల కార్యకలాపాలను 11 వ వీధిగా మాత్రమే పరిమితం చేయాలని ఆ లేఖలో కోరారు.  దీంతో స్పందించిన కమిషనర్ ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విన్నవించుకున్నారు.  ఈ విషయంపై మంత్రి వర్గంలో చర్చలు జరుపుతారా  కామాథిపూరా వాసులు మొర వింటారా అనేది వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: