మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటే నిజాయితికి మరో రూపం అని చెబుతారు. ఎటువంటి కాంట్రవర్సి లేకుండా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించి దేశానికే గొప్ప  పదవి అయిన ప్రధాన మంత్రి పీఠాన్ని రెండు సార్లు అధిరోహించారు. రెండవ సారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత యూపీఏ ప్రభుత్వంలో లొసుగులు మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా  2 జి కేసు, బొగ్గు కుంభ కోణం లాంటికి ఆయనపై మచ్చ పడేలా చేశాయి.  

2జీ స్కామ్ 


మన్మోహన్ సింగ్ మరో అప్రతిష్ట ఎదురైంది, 2 జి కేసులో సహకరించకపోతే ఇబ్బందులు పడతారని తనను బెదిరించారని టెలికం రెగ్యులేటరీ అదారిటీ మాజీ ఛైర్మన్ ప్రదీప్ బైజాల్ ఆరోపించారు. ఆయన ఈ విషయాలపై ఒక పుస్తకం రాశారు. ఒక ఆంగ్ల పత్రిక ఈ విశేషాలు వచ్చాయి. కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్ అనే పుస్తకంలో పలు ఆరోపణలు చేశారు.యుపిఎ -2 ప్రభుత్వం వల్ల తన ప్రతిష్ట దిగజారిందని ఆయన అన్నారు. తన లాంటి అధికారులు ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కారణం అంటున్నారు ఎందుకంటే ఈయన మెతక తనం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నోరు మెదపక పోవడం అంతే కాదు అప్పట్లో ఈయన కేవలం పీఎం పాత్ర పోషిస్తున్నారే తప్ప  విధి నిర్వహణలో చొరవ చూపడం లేదు అని కామెంట్లు కూడా వచ్చాయి.


బొగ్గు కుంభకోణం


టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియమకాన్ని తాను వ్యతిరేకించానని కాని,తన అభ్యంతరాన్ని మన్మోహన్ సింగ్ పట్టించుకోలేదన్నారు. టెలికాం విభాగానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాని, టెలికాం మంత్రి తీసుకుంటారని, వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మారన్ తనను బెదిరించారని కూడా ఆయన తెలిపారు. అంతే కాదు తమ కుంభకోణాలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే యూపీఏ ప్రభుత్వం అంతర్మథనంలో పడిపోయింది, 2009-10లో 2జీ స్కామ్ వెలుగులోకి వచ్చాక ట్రాయ్ లోని కీలక ఫైళ్లను యూపీఏ ప్రభుత్వం మాయ చేసిందని ప్రదీప్ తన గ్రంథంలో  తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: