తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుట్రపన్నుతున్నారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేద వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆంధ్రుల ఇళ్లను కూల్చడానికి కేసీఆర్ ప్రయత్నించాడు. నాకు ప్రజలే హైకమాండ్, నేను ఎవరి పెత్తనం పైనా ఆధారపడిలేను. రాష్ట్ర భవిష్యత్ కోసం విజన్ సాధించడానికే ఈ సంకల్పం. నన్ను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న వారి ఆటను సాగనివ్వను. హైదరాబాద్ పై ఆయనకు ఎంత హక్కు ఉందో, తనకు ఉందని ఆయన అన్నారు.బిజెపి,టిడిపిలకు ఇరవై మంది ఉంటే ఐదుగురిని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరిని టిఆర్ఎస్ కొందని ఆయన అన్నారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ సిగ్గులేకుండా వారు మద్దతు ఇచ్చారని అన్నారు.


రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు సీసీ కెమెరాలో...


అధికారం ఉందికదా అని ఫోన్ టాప్ చేశారని ఆరోపించారు, మాకు కూడా ఇక్కడ ఏసీబీ వాళ్లు ఉన్నారని అన్యాయం చేస్తూ ఉంటే ఎవరూ ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నేనేమైనా సర్వెంట్ నా..? స్టింగ్ ఆపరేషన్ చేస్తూ తప్పుడు డాక్యెమెంట్లు సృష్టిస్తున్నారని అన్నారు. అంతే కాదు అధికారం ఉంది కదా అని మా వాళ్లను భయపెడుతూ, మభ్య పెడుతూ కొనుక్కుంటున్నారని మా ఎమ్మెల్యేని మీ ఫాం హస్ లోకి తీసుకు వెళ్ళి డబ్బు ఇచ్చి పోలీసు భద్రత తో పంపినప్పుడు మీకు గుర్తురాలేదా ఇలాంటి దొంగ రాజకీయాలు అని అడుగుతున్నానన్నారు.


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్


అసలు టీడీపికి రాజీనామ చేయని  తలసాని శ్రీనివాస యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా అని అన్నారు.ఫోన్ టాప్ చేయడం నీచాతినీచం అని ఆయన అన్నారు. తాను కూడా కేసీఆర్ ఆగడాలపై ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తానని చంద్రబాబు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: