కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు.  వాస్తవానికి ఈ నెల 6వ తేదీన సిఎం కెసిఆర్ జిల్లా పర్యటనకు హాజరైన సమయంలోనే స్థానికంగా డిఎస్ తెరాస పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ కొన్ని  కారణాల వల్ల సాధ్యపడలేదు. గత మూడు రోజుల నుంచి కేసీఆర్ ‘హరితహారం’ అధికారిక కార్యక్రమంలో బిజీ బిజీగా ఉండటం చేత డీఎస్ చేరిక సాధ్యం కాలేదు. ఇకపోతే నిజామాబాద్  జిల్లాకు చెందిన ఒకరిద్దరు శాసనసభ్యులు స్థానికంగా డిఎస్ చేరిక   చేపట్టవద్దంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభ్యర్థించినట్టు తెలిసింది. అంతేకాదు డీఎస్ ను కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ ఇతర కాంగ్రెస్ నాయకులు బుజ్జగించడానికి చాలా ప్రయత్నించారు కానీ వీరికి అందుబాటులోకి డీఎస్ రాకపోవడంతో నిరాశచెందారు.

టీఆర్ఎస్


ఇప్పుడు డీఎస్  ఈ నెల 8వ తేదీన తెలంగాణ భవన్‌లో చేరికకు కెసిఆర్ ముహూర్తం ఖరారు చేశారని చెబుతున్నారు. డీఎస్ వెంట ఇద్దరు జడ్పీటిసిలు, మరో ఇద్దరు ఎంపిపిలు, 10మంది నిజామాబాద్ నగర కార్పొరేటర్లు, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, మరికొందరు చోటామోటా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరికోసం దాదాపు 15 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: