ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా సాధన సమయంలో సీమాంధ్ర తరుపున ఎక్కువ ఓ పేరు వినిపించేది ఆయన చేసిన హల్ చల్ మామూలే రేంజ్ లో ఉండేది కాదు ఆయన ఎవరో కాదు లగడపాటి రాజగోపాల్. లగటిపాటి రాజగోపాల్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకొక ప్రత్యేకత ఉంది. అంతేకాదు ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి ఎంపీ కేసీఆర్, లగడపాటి రాజగోపాల్‌ల మధ్య మాటల తూటాలు కూడా పేలాయి.

పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ప్రతిన పూని, చేసిన వాగ్దానం ప్రకారం రాజకీయ సన్యాసం స్వీకరించిన నేత రాజగోపాల్. తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. లగడపాటి కూడా చాలా సైటెంట్ అయిపోయాడు. తాజాగా గోదావరి పుష్కరాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా మంథనిలో రాజగోపాల్ కుటుంబ సమేతంగా పుష్కర స్నానమాచరించారు. కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

పుష్కర పూజలు నిర్వహిస్తున్న కేసీఆర్


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ ఇక్కడ గోదావరి పుష్కరాలు తిలకిస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఎంతో ప్రశాంతంగా చాలా పకడ్భందీగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా కట్టు దిట్టాల మద్య పుష్కరాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాల కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారని ఎంతో ఎత్తుకు ఎత్తారు. అయితే ఆంధ్ర భక్తులకు మరింత సౌకర్య ఏర్పాటు చేయాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆంధ్ర భక్తులకు బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు. వెంటనే కేసీఆర్ స్పందించి వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఎండీ రమణారావును ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: