ప్రముఖ రచయిత, విరసం నేత చలసాని ప్రసాద్ కన్నుమూశారు.ఆయన వయస్సు 83 ఏళ్లు. ఆయన శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. చలసాని ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు.

ప్రముఖ విప్లవ నేత  వరవరరావుతో  చలసాని ప్రసాద్


శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయన సన్నిహిత సంబంధాలుండేవి. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయన సన్నిహిత సంబంధాలుండేవి. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన ప్రసాద్‌ ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారు.కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ప్రసాద్‌ జీవితాంతం కమ్యూనిస్టుగా బతికారు.

కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ప్రసాద్ పేదల కోసం పరితపించేవారు. ఆయన ఎన్నో రచనలు చేశారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు.ఆయన మృతి పట్ల విరసం సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: