జనాలకు ఎండ నుంచి ఉపశమనం లభించినా.. పరిశుభ్రత పాటించకపోతే రోగాలబారిన పడే ప్రమాదమున్నది. వర్షాకాలంలో రోగాలు అధికంగా వచ్చే అవకాశముండడంతో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తాగునీరు, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో అలర్జీ, ఇన్ఫెక్షన్లు, అజీర్ణ సమస్యలు తప్పవు. ఇన్ఫెక్షన్ల ద్వారా చిన్న చిన్న రోగాలు తప్పవు. వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. అందువల్ల వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. 

వర్షాకాలంలో ఆహారం విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

వర్షాకాలంలో ఆవిరి మీద ఉడికించిన ఆహారాలు అంట్లే ఇడ్లీ వంటివి ఆరోగ్యానికి ఉత్తమం. వర్షాకాలంలో ఆయిల్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్‌ను తినడం నివారించాలి. గ్రిల్డ్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉత్తమం. వేసవి కాలంలోనే కాదు, ఫ్రెష్ జ్యూసులకు వర్షాకాలంలో కూడా మంచిదే. శరీరానికి తగిన హైడ్రేషన్ అందివ్వడానికి తాజా పండ్లు, కూరగాయలతో తయారుచేసిన జ్యూసులను తీసుకోవడం మంచిది.

వర్షాకాలంలో శరీరంను ఎనర్జిటిక్ గా మరియు హైడ్రేషన్ లో ఉంచే మంచి న్యూట్రీషియన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చలికాలంలో దాహం వేయలేదని కొంత మంది నీరు త్రాగడమే మానేస్తారు. దాంతో శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది . అలా జరకుండా శరీరంను ఎప్పుడూ తేమగా ఉంచుకోవడానికి మరియు ఇన్ఫెక్షన్స్ భారి నుండి తప్పించుకోవాలంటే నీరు ఎక్కువగా త్రాగాలి. నీరు బాగా మరిగించి, వడపోసిన నీరు మరింత శ్రేయస్కరం. 

నేరుడుపండ్లు వర్షకాలంలో మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల వీటిలో క్యాలరీలు తక్కువ, న్యూట్రీషియన్స్ ఎక్కువ. ఐరన్, ఫొల్లేట్, పొటాషియం, విటమిన్స్ వంటి పోషకాలు అధికంగా ఉండి వర్షాకాలంలో వచ్చే చిన్నచిన్న జబ్బులను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి.

లిచి ఫ్రూట్‌ను మనం వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఈ లిచి ఫ్రూట్. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాలు పెంచడానికి మరియు వ్యాధినిరోధకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది . మరియు ఇది మన శరీరానికి కావల్సిన యాంటీఆక్సిడెంట్స్‌ను అందించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

దానిమ్మ పండు మనలో వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది. దానిమ్మ విత్తనాల్లో అనేక న్యూట్రీషియన్స్ ఉంటాయి. వీటితో పాటు అరటి, బొప్పాయి, ఆపిల్స్, బేరి పండ్లను వర్షాకాలంలో రోజువారీ డై‌ట్‌లో చేర్చుకుంటే వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రోడ్ల పక్కన తోపుడు బండ్లపై అమ్మకానికి ఉంచిన వివిధ రకాల పండ్ల ముక్కలను తినొద్దు. 

వర్షాకాలంలో బయట తిరిగి వచ్చిన వెంటనే చల్లని పదార్థాలను ఆరగించవద్దు. 


మరింత సమాచారం తెలుసుకోండి: