గత కొంత కాలంగా జైలు జీవితం గడిపిన గాలి జనార్థన్ ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డారు.. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో గాలి జనార్థన్‌రెడ్డికి ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌ విషయంలో సిబిఐకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. మూడేళ్ళపాటు జైలులో గడిపి బయటకు వచ్చిన ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. అక్రమ గనుల తవ్వకాలు, ఖనిజాలా అక్రమ రవాణా కేసులో అభియోగాలు ఎదుర్కంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే ఈ సారి ఆయన తీసిన గోతిలో ఆయనే పడ్డట్లయ్యింది.

తమ కుటుంబ, పిల్లల చదువుల నేపథ్యంలో బల్లారికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని  తనకు బెయిలు షరతులు సడలించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొన్నారు. ఆయన బళ్ళారి వెళ్ళడం సంగతి ఏమో కానీ మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. సుమారు ఐదు లక్షల టన్నుల ఇనుప ఖనిజానికి తప్పుడు లెక్కలతో తక్కువ చేసి చూపించి కర్ణాటకలోని కెరికెరి పోర్టు నుండి విదేశాలకు ఎగుమతి చేసినందుకు ఆయనపై లోకాయుక్తలో కేసు నడుస్తోంది. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించిన గాలి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారని పుకార్లు షికారు చేస్తున్నాయి.  

మరోవైపు లోకాయుక్త నుంచి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కోసం వారెంట్లు పొందిన సిట్ 8 బృందాలను రంగంలోకి దించింది. ఎలాగైనా నేటి సాయంత్రంలోగా గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని భావిస్తున్న సిట్ ఆయన కోసం బళ్లారి సహా బెంగళూరును జల్లెడ పడుతోంది. కాగా, గాలి జనార్దన్ రెడ్డి స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కూడా వార్తలు అందుతున్నాయి. అయితే గాలి లొంగుబాటును ఎలాగైనా అడ్డుకోవాలని సిట్ యత్నిస్తోంది. ఇప్పుడు గాలి పరిస్థి ముందు చూస్తే నుయ్యి..వెనక చూస్తే గొయ్యిలా మారింది. కనుక సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం మరో పటిషన్ వేసేందుకు ఆయన సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: