ఈ భూమిపై  సమస్య ప్రతి జీవికి ఉంటుంది. సమస్య లేని జీవి ఉండడు. అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కర లేదు. ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం. మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.

 

మంచి మాటలు: 

 

- అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని


- అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.


- అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు..


- ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.


- అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.


- మనం మన కోసం చేసేది మనతోనే ఆంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది


- ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే.


- మన వలన సమాజానికి మేలు జరగక పోయినా పర్వాలేదు. కీడు మాత్రం జరుగకూడదు 


- జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం .. తనను తాను నియంత్రించుకోగల్గడం.


- జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింఫు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్నా , దశదిక్కులకు, తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి

- ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: