మానవ జీవితం ఉరుకుల పరుగుల మయం అయిపోయింది. ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే ఆఫీసులో పని చేసి అలసి సొలసి ఇంటికి చేరుకునే సరికి రాత్రి పది గంటలు అవుతోంది. ఆధునిక ఎలక్ట్రానిక్, సాఫ్ట్‌వేర్‌, ప‌త్రికా రంగాల ఉద్యోగులు నిరంత‌రం ఆందోళ‌న‌ అనుభవిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నగరాలు... మెట్రో పట్టణాల్లోని సెక్స్ కు దూరమై పోతున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అధ్యయనాలు చెప్పటమే కాదు వాస్తవంగా ఇది జరుగుతుంది. నెలకు ఒక్కసారి మాత్రమే ఆ రుచి చూస్తున్నారు. అది కూడా మొక్కుబ‌డి తంతుగా చేస్తున్నారు.


సెల్ ఫోన్ - టీవీ దెబ్బకు ఆలుమగల మధ్య అసలు సెక్స్ అనేదే లేకుండా పోతోంది. దీంతో శృంగారాన్ని పూర్వంలా జంటలు ఎంజాయ్ చేయలేకపోతున్నారన్నది నిర్విదాంశం. వీటివ‌ల్ల మాన‌వ సంబంధాలు కూడా విచ్ఛిన్న‌మ‌వుతున్నాయి. సెక్స్ వ‌ల్ లైఫ్‌కు ఎక్కువ రోజులు దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల స్త్రీ కంటే పురుషులకే ఎక్కువ నష్టం కలుగుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.


ప్రస్తుతం అందరూ వ్యాయామం చేసే టైం ఉండటం లేదు. ఈ క్రమంలో శృంగారానికి దూరంగా ఉంటే రక్తప్రసరణ సరిగ్గా జరగక శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అని చెబుతున్నారు. శృంగారం చేయని వారిలో ఒత్తిడి పెరిగి...అనేక ఇతర రోగాలకు దారితీస్తుందట‌. ఇక దీర్ఘ‌కాలం పాటు సెక్స్ కు దూరంగా ఉండే పురుషులకు వీటన్నింటితోపాటు అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయ‌ట‌.


వీటితో పాటు సెక్స్ కు దూరంగా ఉంటే ఒత్తిడి - రక్తప్రసరణ-రోగనిరోధక శక్తి తగ్గడం..  అంగస్తంభన సమస్యలు చుట్టుముడుతాయని తాజాగా డెన్మార్క్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: