స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ ఉండటం సహజం. మనిషి సృష్టి ఈ ఇద్దరి మధ్య ఆకర్షణ తో ఏర్పడింది. ఈ ఆకర్షణ అనేది సృష్టి ధర్మం. ఈ ఆకర్షణ అనేది మానవ జీవితంలో ఒక్కో దశలో ఒక్కోలా ఉంటుంది. పెళ్లి కాక ముందు ఈ ఆకర్షణ మొదలైతే దానిని ప్రేమ‌ అంటారు. పెళ్లయిన తర్వాత భాగస్వామిని కాదని మరొకరిపై ఆకర్షణ మొదలైతే మాత్రం దానిని అక్రమ సంబంధం అనాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పెళ్లయిన తర్వాత కూడా తమ భాగస్వాములను కాదని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు సంవత్సరాలుగా ఇలాంటి తరహా సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి.


కొందరు స్త్రీలు అయితే ఏకంగా... ఈ అక్రమ సంబంధం మోజులో పడిపోయి కట్టుకున్న భర్తలను కూడా కడతేర్చారు. అయితే... ఈ ఘటనలు చోటుచేసుకోవడానికి గల అసలు కారణాలేంటో నిపుణులు వివరిస్తున్నారు. మానవ జీవన విధానం కూడా స్త్రీ, పురుషుల మధ్య అక్రమ సంబంధాలకు కారణం అవుతోంది, కొందరు తమ భాగస్వామి నుంచి సరైన సంతృప్తి లేకపోవడంతో తమ కోరికలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధార పడతారు. ఇక స్త్రీ, పురుషులు కలిసి పనిచేసే సమాజం కావటంతో అందం- ఆహార్యం - అలవాట్లు - మాటతీరు - అవసరాలు ఇలాంటి లక్షణాలు కూడా ఆకర్షణ కు దారి తీస్తుంటాయి.


ఇక పెళ్లయిన కొత్తలో భాగస్వామిలో ఉన్న అందం - ఆకర్ష‌ణ‌, ప్రేమ కాల క్రమేణా తగ్గుతూ ఉంటాయి. అందం తగ్గింది.. సౌందర్య పోషణ లేదని... లావ‌య్యార‌ని కొందరు భాగస్వామిని పట్టించుకోరు. మరి కొందరు భార్యాభర్తలుగా ఉన్న ఒకరిపై ఒకరు ఉండరు. ఇలాంటి టైమ్ లో ఇతరుల నుంచి అవి దొరికినప్పుడు ఆకర్షణ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అసంతృప్తి కూడా ఆకర్షణకు కారణం. ఉద్యోగాలు, బిజీతో కుటుంబానికి తగినంత సమయం కేటాయించకపోవడంతో భార్యకు ఉండాల్సిన సరదాలు, షికార్లు లభించవు. ఈ టైంలో కూడా అది ఇతరుల నుంచి లభించినప్పుడు అసంతృప్తితో కావాలని కాకుండా పొరపాటుగా త‌ప్పుచేసే ఛాన్సులు కూడా ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: