ప్రేమ ఉందన్న శృంగారం,  ఆకర్షణ తగ్గిన వెంటనే చప్పగా చల్లారిపోతుంది. అలా అని అన్ని శృంగారాలు, వాంఛతోనే అంతమౌతాయనేం లేదు. కొన్ని శృంగార బంధాలు తాత్కాలిక ఉద్వేగాలు, ఆకర్షణలతో మొదలైనా వారి మధ్య ప్రేమ బావనలు చివురించి ఇద్దరూ జీవితకలాలం కలిసి ఉండవచ్చు. అది వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి పంచుకున్న అనుభూతుల్ని బట్టి ఉంటుంది. అందువలన అన్ని శృంగార బంధాలు కేవలం అక్కడితోనే ఆగిపోతాయని అనుకోవడానికి వీలు లేదు. యుక్త వయసు వచ్చాక లైంగిక వాంఛలు రేగటం సహజం. ఆపోజిట్ సెక్స్ తో శృంగారంలో పాల్గొనాలని టీనేజర్స్ కి బాగా వాంఛగా ఉంటుంది. ఒక వయసు వచ్చేంత వరకు శృంగార బావనలే ప్రేమ అని, వయసు ఉద్వేగమే వాంఛ అని బావిస్తారు. నిజానికి శృంగారంలో ప్రేమ పాత్ర కన్నా ఆకర్షణ పాత్ర ఎక్కువగా ఉంటుంది.


ఇద్దరు యవతీయువకుల మధ్య శృంగార బంధం ఉన్నంత మాత్రాన ప్రేమబంధం ఉండాలన్న రూలేంలేదు. ప్రేమ మనసుల్ని కలుపుతుంది. అదే శృంగారంలో అయితే అది వయసుకి సంబంధించిన ఉద్వేగంగా ఉంటుంది.  అలాగే వైవాహిక బంధాలలో కొనసాగే వ్యక్తులని కూడా పరస్త్రీ లేదా పురుషుడి మీద మొదట వ్యామోహం కలగ వచ్చు. ఆ మోహం వారి మధ్య స్నేహ బంధంగా మారి చివరికి శృంగారానికి దారి తీయవచ్చు. ఆ శృంగార అనుభూతి ప్రేమగా మారి వారిద్దరి మనసుల్ని ఊగించి, శాసించే బలీయమైన బంధంగా మారవచ్చు. యిద్దరు స్త్రీ, పురుషుల మధ్య సాగే శృంగార బంధం ఎక్కడి వరకు వెడుతుందో ఎవరికి తెలియదు. వారిరువురి మధ్య సాగే బంధం తప్పా ? అనేది వారికి అనవసర విషయంగా ఉంటుంది.  శృంగారంలో ఆనందపు లోతులు తరిచి చూసూకొలది వారి మధ్య అనుబంధంగా ముడపడుతుంది. అలాంటి శృంగార అనుభూతి దక్కని వారు భార్యాభర్తలైనా సరే నీర్తిప్తంగా మారిపోతారు.


పడకగదిని ప్రణయ కథన రంగంగా మలుచు కోలేని దంపతులు క్రమేపి ఒకరిపట్ల ఒకరు ఆసక్తిని కోల్పోతారు. అంతే కాదు ! యిలాంటి అనుభూతి లేని దంపతులు త్వరలోనే వివాహేతర సంబంధాలలోకి వెళ్తుంటారు.  అందువలన మనిషికి ప్రేమ ఎంత అవసరమో, శృంగారానికి ఎప్పుడూ బలీయమైన స్థానం ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, శృంగారం అతీతంగా రెండు వేర్వేరు అంశాలుగా ఉంటాయనుకోవటం పొరబాటే. యవ్వనం చిగురించి, ఆశలు తొలకరించి మనసులో మోహావేశం పరవళ్లు తొక్కుతుంటే అతడు, ఆమె ప్రకృతి పురుషుల్లా కలిసిపోవాలని ఆరాటపడుతుంటారు.


నిజానికి సమాజం ఆమోదించని సంబంధాలలోనే స్త్రీ, పురుషులు ఎక్కువ అనుభూతిని పొందుతుంటారు. ప్రేమలేని శృంగారం కేవలం వేడిని చల్లార్చుకున్నట్లుగా ఉంటుంది. తప్ప పరిపూర్ణ అనుభూతిని ఇవ్వదు. అందుకే అన్నారు ప్రేమలేని ముద్దు కన్నా మరణం మేలని. అలాంటి ప్రేమానుభూతుల్ని సొంతం చేసుకోవాలంటే శృంగారంలో ప్రేమ, ప్రేమలో శృంగారం తప్పని సరిగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: