రామరావణ యుద్ద నివారణకు మాల్యవంతుడు, విభిషణుడు విరీరువురిలో ఎవరు ఎక్కువ ప్రయత్నం చేశారు లేదా ఉపదేశం చేశారు అనేది శ్లోకముల సంఖ్యను బట్టి నిర్ణయించకూడదు. వారా ప్రయత్నము ఏ సందర్బంలో చేశారనే దానిని బట్టి నిర్ణయించాలి. మాల్యవంతుడు రావణుని తాత. ఇతడు ఎప్పుడూ రావణునికి ప్రియమైన మాటలే చెప్పాడు. ఎటొచ్చీ యుద్ద సమయం ఆసన్నమైనటువంటి సందర్భాంలో అదీ కూడా రావణాసురుడు ఎక్కడ అపజయం పాలవుతాడోననే భయంతో మాత్రమే యుద్దాన్ని నివారించమని రావణునికి ఉపదేశించాడు. అది కూడా తాత్కాలికమే. కానీ విభీషణుడు సీతమ్మను రావణుడు అపహరించినప్పటి నుండీ సర్వకాలాలలోనూ రావణున్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే రామరావణ యుద్ద నివారణకు విభీషణుడే ఎక్కువ ప్రయత్నం చేశాడని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: