హిందువులు వేప చెట్టును పూజిస్తారు. మామిడి చెట్టును పూజించరు. ఎందుకిలా చేస్తారు అని నన్ను ఒకరు ప్రశ్నించారు. వేప కాయలు చేదు. ఆకులు పచ్చి చేదు. చెట్టంతా చేదుమయం. చేదుగా ఉంటుందని వేపని నిర్లక్ష్యం చేయకూడదు. మనకు అనుభవాల్లో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. షడ్రచుల్లో కూడా చేదు ఒకటి. కాబట్టి, చేదుని పూర్తిగా తొలగించలేము. విస్మరించలేము కూడా. పనికట్టుకొని ఎవ్వరూ వేపతోట వేయరు. పైపెచ్చు, సహజంగా మొలచిన మొక్కలను అజ్ఞానంతో పీకిపారవేస్తే, వేప జాతే అంతరించిపోతుంది. అలా జరగకుండా చూడడంలోనే భారతీయ వివేకం ఉట్టిపడుతుంది.

Image result for neem tree

వేప చెట్టుకు చెదలు పట్టవు. దాని ఎదుగుదలకు మనం శ్రద్ధ వహించనవసరం లేదు. పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. తల్లి బిడ్డను ఎలా రక్షిస్తుందో, అలాగే వేప చేట్టు కూడా మనలను అన్ని విధాల సంరక్షిస్తుంది. వేప చెట్టు పైనుంచి వీచే గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుద్ధమవుతాయి. ఈ గాలి రక్తనాళాలకు మంచిది. దీని వల్ల చర్మవ్యాధులు దరిచేరవు. వృక్షజాతిలో వేపచెట్టు ఎక్కువ ప్రాణ వాయువునిస్తుంది. ఇది అంటురోగాలను కూడా తరిమికొడుతుంది.

Image result for neem tree

వేపకర్ర ఇంటి గుమ్మాలకు, కిటికీలకు ఉపయోగపడుతుంది. పూర్వం దీనినే తప్పనిసరిగా వాడేవారు. ఇంటి ప్రాగణంలో వేప చెట్టు ఉంటే ఆయుష్షు వృద్ధి చెందుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఔషద రసాయనాలలో వేప పాత్ర చాలా ప్రధానమైనది. వేపపుల్లతో దంతశుద్ధి చేసుకునేవారికి 90 ఏళ్ళ వయసులో కూడా పటిష్ఠమైన దంతాల వరస ఉంటుందని వైద్యశాస్త్రం చెబుతుంది.
Image result for neem tree
వేప చెట్టు క్రింద కూర్చుంటే ఎన్నో మానసిక వైకల్యాలను కూడా అధిగమించవచ్చునంటారు. మండు వేసవిలో వేప చెట్టు కింద చాలా చల్లగా ఉంటుంది. తాపాన్ని, పాపాన్ని హరించగలిగే ఒక్క వేపవృక్షానికే ఉంది. అందుకే ఆరోగ్యకరమైన పరిసరాల కోసం వేపచెట్లను పెంపొందించు


మరింత సమాచారం తెలుసుకోండి: