నమస్కారము – కాయకము, వాచికము, మాసికము అని మూడు విధాలు.

1. కాయకము: ఇది శారీరకమైనది, రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకుని అష్టాంగాల్ని నేలపైమోపి చేయబడు సాష్టాంగ నమస్కారం, మరియు ధ్యాన ముద్ర నమస్కారము. (ఎడమబోటనివేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకుని, ఇతర వ్రేళ్ళను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది) ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.


2. వాచికము: నోటితో ఉచ్ఛరించునది. “నమః”, “నమస్కారము” మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం. అందుకే ఈ నమస్కారానికి మన హైందవంలో ఇంత ప్రాధాన్యం ఉందన్న విషయం మనకు తెలుసు.


3. మాసికము: దైవంపట్ల, మనఃపూర్వకమైన ‘నమస్కార’ భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటయే అవుతుంది. కాయక నమస్కారంతో (శారీరక నమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: