చిలుకూరు బాలాజీ ఆలయం... హైదరాబాద్ శివార్లలోని ఈ ఆలయానికి కొత్త సంవత్సరం రోజు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ సంఖ్య వేలు దాటిపోతోంది. అందుకే ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ యాజమాన్యం తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

 

ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు ప్రసిద్ది పొందిన సంగతి తెలిసిందే. 11 దర్శనాలు చేసుకుని కోరిక కోరిన వారు..అది నెరవేరితే 108 ప్రదక్షిణాలు చేస్తారు.అయితే రద్దీ దృష్ట్యా ఈ 11, 108 ప్రదక్షణలను పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాదు.. గర్భగుడిలోని ఈ రోజు అనుమతించరు. మహాద్వారం నుంచే దర్శనాలు కొనసాగిస్తారు.

 

ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను రాజేంద్రనగర్ ఏసీపీ పరిశీలించారు. ఇక ఆలయానికి కిలోమీటరు దూరంలోనే వాహనాల పార్కింగు కోసం ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులు సహకరించాలని కోరారు. 108 దర్శనాల కోసం వచ్చే వారు.. మరో రోజును అందుకు ఎన్నుకోవాలని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: