హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి వేళ.. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి అశేష భక్తజనులు తిరుమలకు చేరుకున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల వీధులు మార్మోగుతున్నాయి.

 

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకోని ఉదయం 9 గంటల నుంచి స్వర్ణ రథంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారు తిరుమాఢ వీధుల్లో దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిన శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఇప్పటికే ప్రముఖలు తిరుమలకు చేరుకున్నారు. ఉదయం 2 గంటల నుంచే వైకుంఠ దర్శనం ప్రారంభమైంది.

 

ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు దర్శనం అనంతరం ఉదయం 5 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం అందిచే దాతలకు రోజుకు 2500 మంది చొప్పున దర్శనాన్ని కల్పిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకార్థ్యాలను టీటీడీ నిరంతరం సమీక్షిస్తోంది.

 

దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు శనివారంఆలయ అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్ల లో వేచి ఉండే భక్తులకు భద్రత పరమైన ఇబ్బందులు కలుగకుండా విజిలెన్స్ అధికారులు సమీక్షిస్తున్నారు. భక్తుల వసతి,దర్శన సదూపాయలపై ఎప్పటికప్పుడు అదనపు ఈవో సమీక్షించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: