మానవుడి మనస్సు ఓ వింత ప్రపంచం. దాన్ని అర్థం చేసుకోవడం  అంత సులభం కాదు. అది ఎలాంటి ఆకర్షణలకు లోనవుతుందో.. అందులో మంచీ చెడూ ఏమిటో నిశితంగా పరిశీలించకోపోతే.. ఎప్పటికప్పడు సమీక్షించుకోకపోతే.. మనసు మాయలో పడిపోవడం సహజం. మరి మనసును అంతగా ఆకట్టుకునేదేంటి. ఆ ఆకర్షణను సరిగ్గా విశ్లేషించడం ఎలా.. 

ఈ ప్రపంచంలో ఆకర్షణలకు కొదవు లేదు. మనసు మాయ చేసే విషయాలకు అంతం లేదు. చిన్నపిల్లలకు చాక్లెట్లకు ఆకర్షణకు గురవుతారు. అంత కంటే కొంచెం పెద్దవారు ఆటబొమ్మలపై మక్కువ పెంచుకుంటారు. వయసుకు వచ్చిన యువతీయువకులు ఒకరి పట్ల మరొకరు ఆకర్షణకు గురవుతారు. అయితే ఈ అన్ని ఆకర్షణల్లోనూ మనసు మెదడను పనిచేయనివ్వదు. 

ఎంత సేపూ కనిపించింది కావాలని మారాం చేయడం తప్ప.. దానికి ముందూ వెనుకా పర్యవసానాలను ఆలోచించేందుకు మనస్సు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. అక్కడే మనిషిలో వివేకం మేల్కోవాలి. మననుసు ఆకర్షణ మాయ కమ్మేస్తున్నప్పుడు వవేకం మేల్కొనకపోతే.. ఆ వస్తువు మాయలో పడిపోవడం ఖాయం. 

అందుకే ఈ ప్రపంచంలో మాయ ఎంత బలమైందో, ఆకర్షణ ఎంత బలమైందో అంత కంటే ఎక్కువ మనోబలం మనిషి సాధించాలి. అప్పుడే అన్నిరకాల మాయలను, ఆకర్షణలను అవలీలగా ఎదుర్కొని.. జీవన అభ్యున్నతి మార్గాలను అన్వేషించే అవకాశం కలుగుతుంది. లేకపోతే.. ఆకర్షణలో పడి విచక్షణ కోల్పోయి.. జీవితం అంధకార బంధురమవుతుంది.

ఇందుకు ఉదాహరణగా దీపం.. దాని చుట్టూ తిరిగే పురుగులను చెప్పుకోవచ్చు. ఆ పురుగులకు ఆ వెలుగుపట్ల అంతులేని ఆకర్షణ. అది అగ్ని.. దాని స్పర్శతో  మరణం సంభవిస్తుందన్న వివేకం ఆ పురుగులకు లేకపోబట్టే.. అవి ఆకర్షణకు గురై చివరకు ఆ దీపానికే బలవుతాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: