దక్షిణాదేవి గాథలో పతిసౌభాగ్యము స్త్రీకి ఎంత గౌరవమూ, గర్వమూ ఇస్తాయో చెప్పబడింది. సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలమూ, మహా దానాలిచ్చిన ఫలమూ, సర్వ తపస్సులు చేసిన ఫలమూ, మహా ఉపవాసాలు చేసిన పుణ్యమూ, అనేక సత్కర్మలు చేసిన ఫలమూ, ఇవన్నీ కలిపినారాని పుణ్యం భర్త మనస్సెరిగి నడిచిన స్త్రీకి దక్కుతాయని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. పురాణాల్లో పతివ్రతల విషయాల కొస్తే ద్రౌపది పడరాని పాట్లు పడింది. నలుని కోసం దమయంతి అనే అగచాట్లు పడింది. ఏ పరిస్థితుల్లోనూ  వాళ్ళు భర్తని కించపరచలేదు. సుఖంలో సుఖంగా ఉన్నారు. కష్టాలను కూడా సుఖంగానే భావిస్తూ గడిపారు.  భర్తతో గొడవపడి దూరమయ్యిందంటే ఆ స్త్రీ లక్షపాపాలు దాటినట్లు దానికి కారణమైన ఆ పురుషుడు రెండు లక్షల పాపాలను దాటినట్టు. దానికి శిక్షే ఇరువురూ దూరమవ్వటం. ఒక్కసారి దూరమై, విడిపోయి తిరిగి కలుసుకొన్నా, వారు చేసిన ఏ కార్యమూ, పుణ్యమూ ఫలం ఇవ్వదు. అలాగే వారికిచ్చిన దానమూ చెప్పిన ధర్మమూ వృధాయే. 

మరింత సమాచారం తెలుసుకోండి: