వ్రత, పూజ సమయాల్లోనూ, పంచాంగ శ్రవణము వంటి సమయాల్లోనూ, వ్రతాదిశుభకార్యాల్లోనూ పురాణ జ్ణానాన్ని బోధించేవారికి తప్పక దక్షిణ ఇవ్వాలి. అటువంటివ వాటిల్లో దక్షిణ ఇవ్వటం పుణ్యప్రదం. అటుల ఇవ్వనిచో భర్తలేని సౌందర్యవతి అందమూ, పారిపోయేవాణ్ణి తరమటమూ, అన్ని శాస్త్రాలు తెలిసినా చెప్పట తెలియనితనమూ ఎలాంటి వ్యర్థ ప్రయోజనాలని ఇస్తాయో అంతటి వ్యర్థ ప్రయోజనం కలుగుతుతుంది. ఎన్ని యాగాలూ, యజ్ణాలూ చేసినా పుణ్యంరాదు. అట్టి పురాణ ప్రవచనాన్ని అందించేవాడు, శాంత స్వభావం కలవాడై, తెల్లని చక్కని వస్త్రములతో మెడలో పూలమాల ధరించి పురాణశ్రవణాన్ని చేయాలి. అందరికన్నా ఎత్తైన ఆసనం మీద కూర్చుని చెప్పాలి. అలా చెప్పిన వాని పురాణ శ్రవణాన్ని విని దక్షిణ  ఇచ్చిన వారికి అనేక దోషాలు కూడా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: