భారతీయ నైతిక ప్రవర్తనను అనుసరించి దిగంబరంగా శరీరంపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా నిద్రపోవడం సరియైనది కాదు. ఈ నిషేధం స్త్రీల విషయంలో ఎక్కువ కఠినంగా నియమించబడింది. అలా నగ్నంగా, ఒంటిపై నూలుపోగు సైతం లేకుండా నిద్రపోతే రాత్రి సమయంలో విహరించే గంధర్వులు అలా నిద్రపోతున్న వారిని చూసి, వచ్చి వారి పక్కన పండకుంటారని విశ్వసించబడింది. సహజంగా రాత్రి సమయంలో శరీర రసాయనిక వ్యవస్థ కొన్ని మార్పులకు గురిఅవుతుంటుంది. నగ్నంగా నిద్రించిన వారి విషయంలో ఈ రసాయనిక మార్పులు తీవ్రంగా జరుగుతాయని అధ్యాయనాలు వెల్లడి చేస్తున్నాయి.   అలా నగ్నంగా నిద్రిస్తే ముఖ్యంగా మర్మావయం(జననేంద్రియం)హానికి గురి అయ్యే అవకాశమెక్కువ. ఈ కారణంగా దిగంబరులై నిద్రంచ కూడదని వైద్య శాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: