వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితమని పురోహితులు అంటున్నారు.   వినాయక చతుర్థి రోజునే కాకుండా ప్రతిరోజూ విఘ్నేశ్వరుడిని గరికపోచలతో పూజించే వారికి సకల శుభాలు చేకూరుతాయి.చతుర్ధీ పూజన ప్రీత:" అంటే వినాయకుని చతుర్ధి పూజంటే ప్రీతి. ఈ తిథినాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించినాడు.

Related image

భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితీ గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ-పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు.  ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.  బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి, పరబ్రహ్మను ప్రార్థించాడు.

Related image

ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపజేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాల్ని హరింపజేస్తాడు. కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి. ఆ రోజున ఉపవాసం చేసి పూజ తర్వాత 21సార్లు "ఓం శ్రీ గణేశాయ నమ:" అని జపించాలని పురోహితులు చెబుతున్నారు.దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించేవారని.. అందుకే వినాయకుడికి గరికపోచలతో పూజ చేస్తారని పండితులు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: