వేదవ్యాసుడు పరాశురుని కుమారుడు. వేదాలను కూర్చినవాడు అందరికీ ధర్మమార్గం గురించి వివరించడానికి ఒక కథని చెప్పాడు.అదే మహాభారతం. 
చెప్పిన కథని రాయడానికి ఒక లేఖకుడు కావాలి. మహర్షి చెప్పిన భారతాన్ని రాయగలవాడు వినాయకుడు ఒక్కడే. అందుకే ఆయననే కోరాడు. 
వినాయకుడు అంగీకరించాడు. మహాభారత రచన పూర్తయ్యింది. ఇక దానిని తరువాతి తరాలకి అందించాలి. 

వేదవ్యాసుని కుమారుడు శుకుడు. ప్రియశిష్యుడు వైశంపాయనుడు వాళ్ళిద్దరికీ నేర్పాడు. వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమవేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్ధునికోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు - వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు - తాను చెప్పినదానిని పూర్తిగ అర్ధం చేసుకొనే గణపతి వ్రాయాలి. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. 
Image result for వేదవ్యాసుడు వినాయకుడు
తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది. మహాభారతం గురించి ముందుమాట చెప్పాలంటే ఈ పదిమంది పేర్లూ జ్ఞాపకం ఉంచుకోవాలి. పరాశురుడు, వేదవ్యాసుడు, వినాయకుడు, నారదుడు, శుకుడు, వైశంపాయనుడు, పరీక్షిత్తు, జనమేజయుడు, సూతుడు, సౌనకుడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: