గణపతి ఉత్సవాలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి.   చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తారతమ్యాలు లేకుండా ప్రతీఒక్కరూ అత్యంత ఇష్టంతో ఆహ్లాదంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. విఘ్నాలకు అధిపతి వినాయకుడు కావడంతో జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.  వినాయక చవితి సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక వీరభద్ర సినిమా టాకీస్ నుంచి బస్తా బస్టాండ్, గాంధీ చౌక్ వరకు వినాయక విగ్రహా లు, పూజ సామాగ్రి కొనుగోలు చేసి వ్యక్తులతో సందడి నెలకొంది. 


వివిధ ప్రధాన కూడళ్ల వద్ద వినాయక విగ్రహాల ఏర్పాటు చేశారు..వాటిని కొనుగోలు చేయడానికి భక్తులు క్యూ కడుతున్నారు.  పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయ క విగ్రహాల విక్రయ కేంద్రాల వద్ద విగ్రహాల అమ్మకం భారీగా సాగుతుంది. వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడంతో ప్రకృతిలో విపరీతమైన పరిణామాలు చేసుకుంటున్నట్లు, పర్యావరణ ప రిరక్షణకు సమాజంలోని అన్ని వర్గాలు కృషి చేయాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.  నాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.


ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం నిర్వహకులు పట్టణాలలో వివిధ రకాలైన విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలు ఏర్పాటు చేస్తారు.  గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ నగరం ముస్తాబైంది. ఐదు అడుగుల నుంచి 20 అడుగుల వరకు వివిధ ఆకారాల్లో గణనాథులు కొలువుదీరుతున్నాయి. విభిన్న రూపాల్లో కలర్‌ఫుల్‌గా లంబోదరుడు కనువిందు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా గణపతిబప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథులు తరలివస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: