ఈ సృష్టిలో తీయనిది ప్రేమే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. కానీ ఎలాంటి ప్రేమ.. ప్రేమ క్షణికమా.. శాశ్వతమా.. ప్రేమకూ కామానికీ సంబంధం ఉందా.. ? ఈ విషయంలో చాలా సందేహాలుంటాయి. వాటికి సమాధానమే ఇది.

సంబంధిత చిత్రం


మనిషి తన ప్రేమను విశ్వానికి ఆపాదించగలిగినప్పుడు, ఆధ్యాత్మికతతో కలిపి చూసినప్పుడు.అది ఆర్ద్రగీతమై పల్లవిస్తుంది. అప్పుడు సిసలైన ప్రేమ మాధుర్యం మనకు తెలుస్తుంది. అది కామానికి అతీతమైన ఓ అమృతభావన. మన హృదయాలను స్పృశిస్తుంది.

KRISHNA AND GOPIKA PAINTINGS కోసం చిత్ర ఫలితం


ఈ అమృత భావన కారణంగా ప్రపంచమంతా మనకు ప్రేమమయంగా కనిపిస్తుంది. ఇదే పరమ ఉత్కృష్టమైన, ఉదాత్తమైన స్థితి. శ్రీకృష్ణడు, గోపికల బంధాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. ఈ స్థితిలో ఉన్న గోపికలు ఏ అంగన ఎదురైనా ఆలింగనం చేసుకునేవాళ్లు. వారిలో కృష్ణుడిని దర్శించేవారు.

KRISHNA AND GOPIKA PAINTINGS కోసం చిత్ర ఫలితం


ఆ ఏకత్వానికి ప్రేమే పునాది. అది ప్రేమ మాధుర్యం. ఇలాంటి ప్రేమ పుట్టతేనెలాంటిది. దాన్ని చవిచూసిన వాళ్లకు ఇతర భావనలన్నీ రుచించవు. ప్రేమ అనుభూతమైన వారికి ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. అదీ ప్రేమలోని అద్భుత భావన. ఇదే ప్రతి మనిషీ సాధించాల్సిన అమృత స్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: