మానవుడి అన్ని కష్టాలకూ కారణం కోరికలే అంటాడు బుద్ధుడు.. కానీ కోరికలు లేని మనిషి జన్మ ఎందుకు.. ఏ కోరికా లేకుండా ఇంకా బతకడం ఎందుకు అన్న అనుమానం చాలా మందికి వస్తుంది.. ఇది నిజమేనా.. కోరికలు వద్దంటే అస్సలు కోరికలు లేకుండా అని కాదు..

అతిగా ఆశ పడకుండా.. సాధ్యమైనంత తక్కువ కోరికలతో బతకడం ప్రశాంతతనిస్తుంది. కోరికకు ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆశ్రయమిస్తుంటాయి. అది జ్ఞానాన్ని కప్పివేసి మనిషిని మోహానికి గురిచేస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసే కోరికకు ఆశ్రయమిచ్చే ఇంద్రియాలను నియంత్రణలో పెట్టాలి.

SPIRITUAL LIFE కోసం చిత్ర ఫలితం


పాములు పుట్ట నుంచి బయటకు వచ్చి స్వభావసిద్ధంగా మనుషులను కాటువేస్తాయి. ఇంద్రియాలు కూడా అంతే. విషయాసక్తి అనే విషాన్ని ప్రాణులలో వ్యాపింపజేసి నాశనం చేస్తాయి. వీటివల్ల జీవులు క్షణికమైన విషయసుఖాల్లో చిక్కుకుని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు.

వంద ఉన్నవాడు వెయ్యి, వెయ్యి ఉన్నవాడు లక్ష, లక్ష గలవాడు రాజ్యం, రాజ్యం పొందినవాడు స్వర్గం.... ఇలా అనంతంగా కోరుతూనే ఉంటారు. ఆశ పెరుగుతూ ఉన్నంతకాలం ఆరాటమే ఉంటుంది. అందుకే మనకు దొరికిన దానితో తృప్తిపడటం.. సాధ్యమైనంత వరకూ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా కోరికలను జయించే ప్రయత్నం చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: