వికారినామ సంవత్సర ఆషాడ శుద్ద పౌర్ణమి 16 - 07 - 19 మంగళవారం ఉత్తరాషాడ నక్షత్రము నందు ధనస్సు మరియు మకర రాశి -  ఉత్తరాషాడ నక్షత్రము నందు కేతు గ్రస్త  చంద్రగ్రహణం  సంభవిస్తున్నది. అనగా ధనుర్ రాశీ,మకర రాశీ వారు చూడరాదు.మూల,పూర్వాషాఢ,ఉత్తరశాడా,శ్రవణం నక్షత్రాల వారు శాంతుల చేసుకోవాలి.
గ్రహణఃస్పర్శ కాలం -  16 - 7 2019 - 17 - 7 - 2019
గ్రహణ స్పర్స కాలము - మద్య రాత్రి - 01  - 30am 
గ్రహణ మధ్యకాలం - ఉదయం 3 - 00 am 
గ్రహణ మొక్షకాలము - ఉదయం - 04 - 30 am 
గ్రహణము భారతదేశలో కనిపిస్తునందున గ్రహణము ఆచరించవలెను.


భోజన విచారము 
ఈ రోజున సుర్యోదయము నుండి  మ 03 - 48 గం ల వరకు ఆహారము స్వీకరించవచ్చు .బాలురు వృద్దులు,  ఆనారోగ్యులు , ఆశక్తులు ఈ రోజున రా - 09 -  15 గం ల వరకు ఆహారం తీసుకొనవచ్చును. 


తర్పణ విచారము 
ఈ రోజున గ్రహణ మద్యకాలములో అనగా రాత్రి 03 - 00 గం నంతరము గ్రహణ మోక్ష కాలములో ముందుర పితృు దేవతలకు తర్పణం వదలవలేను.


శ్రాద్ద విచారము 
ది 16 - 7 - 19 మంగళవారము ఆషాడ శుద్ద పౌర్ణమి ( పౌర్ణమి తిథి)  శ్రాధ్దమును  చేయవలెను


శాంతి విచారము 
ఉత్తారాషాడ నక్షత్రము  ధనస్సు మరియు మకర రాశి వారికి  విషేశ అనిష్టము , వృషభ , ధనస్సు, కన్య , మకర రాశుల వారికి   ఆశుభ ఫలము.ఈ రాశుల  వారు గ్రహణపీడ  పరిహారము కొరకు  
జప , పారాయణ , దానములను తప్పక చేసుకొనవలెను.


శ్లోకం 
ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతిః ! 
చంద్రోపరాగసంభూతాం ఆగ్నిపీడాం వ్యపోహతు !!
యఃకర్మసాక్షి లోకాణాం ధర్మోమహిషవాహణః !
యమఃచంద్రోప రాగోథ్తాం గ్రహపీడాం వ్యపోహతు!!
ప్రాణరూపోహి లోకానాం  సదాకృష్ణమృగప్రియః!
 వాయుశ్చంద్రోప రాగోథ్తాం 
గ్రహపీడాం వ్యపోహతు !!
యోసౌనిధిపతిర్దేవః ఖడ్గశూల గధ ధరహః !
చంద్రోపరాగకలశం ధనదోత్ర వ్యపోహతు !! 
యోసావింధు ధరోదేవః పీనాకి వృషవాహనః !
చంద్రోపరాగ పాపాని శనశయతు శంకరః!!


గ్రహణ కాలములో పాటించే ఆచార  విచారములు:


గ్రహణ అచరణములో శాస్త్ర వచనం అనగా భగవంతుని ఆదేశ, పరమాత్మ మన బతుకునకు వేసిన సంవిదానం ఇది. ఆవశ్యముగా ఆచరణము చేయవలేను.గ్రహణ కాలమును సూతక సమయంగా కూడ పరిగణిస్తారు.ఎందుకనగా ఈ సమయము బహుళ ఆశుభముగా వుండును.
గ్రహణ ఆరంభం ఆంత్యమున స్నానము చేయవలేను.
గ్రహణ ఆరంభంలో చేయు స్నానము నుండి జప - పారాయణ - దానములకు మాత్రమే అధికారం భోజనం , ఫళహరములు లేవు.
చంద్రగ్రహణం సూతకము గ్రహణ  ఆరంభం నుండి 9 గం మొదలు ఆరంభమగును. గ్రహణ మోక్ష కాలము నంతరము చేయు స్నాన నంతరము సూతకము విడువును.
గ్రహణ కాలము లో ఎటువంటు ద్రవ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. 
గ్రహణ మొక్ష కాలము తర్వాత స్నాన పూజాది కార్యక్రమాలు చేసి స్వీకరించవచ్చును.
గ్రహణము కంటే ముందుగా చేసినటువంటి పదార్థాలు గ్రహణ కాలములో చేసినవి స్వీకరించరాదు.
దేవాలయం మరియు పూజ ప్రతిమలన్ను స్పర్స చేయకూడదు.
గ్రహణ కాలములో లైంగిక సంపర్గము , ఏ కారణము వలనైన అలంకారము చేసుకొనకూడదు.
శుభ ఫలం - కర్కాటక , తుల , కుంభ , మీన
మిశ్రమ ఫలం - మేష , మిథున , సింహ , వృశ్చిక 
ఆశుభ ఫలం - వృషభ , ధనస్సు , కన్యా , మకర
దానములు -  బియ్యం ;  ఉలవలు  ;రాహు,కేతు నాగ పడగలు;రాగిపళ్ళెము;అవునెయ్యి వీటితో దక్షిణ సమేతముగా దానము చేయవలెను


మరింత సమాచారం తెలుసుకోండి: