శ్రీ కళ్యాణ గుణవహం, రిపుహరం, దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్య ఫలదం, గోదవతుల్యం నృణాం ఆయుర్వద్ధిద ముత్తమం, శుచికరం, సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సుముచితం పంచాంగ మాకర్ణ్యతామ్. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్దికి, నక్షత్రాలు పప పరిహారానికి, యోగాలు రోగ నివారణ, కరణములు కార్యసిద్దికి తోడ్పడతాయి. పై ఐదింటినీ కలిగినదే పంచాంగం. తిథులనేవి మానవ శ్రేయస్సును, వారాలనేవి ఆయు ర్వృద్దిని, నక్షత్రాలు పాపపరిహారాలనేవి కార్యసిద్దిని కలుగజేస్తాయి. వీటన్నింటినీ కలిగినటువంటి ‘‘పంచాంగ శ్రవణం’’ వలన అందరికీ శుభం చేకూరుతుంది. పంచాంగ శ్రవణం వలన శత్రువుల బాధ, దుస్వప్నాల వలన కలిగే కీడు తొలగిపోతుంది. గంగా స్నానం చేసినంత పుణ్యమూ, గోదానంతో సమానమైన పుణ్యం కలిగి ఆయుష్షు వృద్ది చెందుతుంది. మంచి సంతానం లభిస్తుంది. పంచాంగం అనేక కర్మలు చేయడానికి ఒక సాధనం అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: