ప్రస్తుతం శ్రీలంక  చెత్త రికార్డులను సృష్టించడమే పనిగా పెట్టుకున్నట్లు వుంది. అందులో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా తో  జరిగిన మొదటి  టీ 20మ్యాచ్ లో  శ్రీలంక బౌలర్ కసున్ రజిత నాలుగు ఓవర్లలో  75పరుగులు ఇచ్చి టీ 20 ల్లో అత్యధిక  పరుగులు ఇచ్చిన  బౌలర్ గా  చెత్త ఘనత ను సాధించగా  తాజాగా  రెండో టీ 20లో శ్రీలంక అల్ ఔటై  మరోచెత్త రికార్డును  నమోదు చేసింది. 


మంగళవారం  బ్రిస్బేన్  వేదికగా  ఆసీస్ తో జరిగిన  రెండో టీ 20 లో 17ఓవర్లోనే  117పరుగులకు ఆల్  ఔటైయ్యింది  శ్రీలంక.  తద్వారా అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక సార్లు ఆల్ ఔటైన జట్టుగా  రికార్డు సృష్టించింది.  ఇప్పటివరకు  24 మ్యాచ్ ల్లో శ్రీలంక  ఆల్  ఔట్ కాగా 23 మ్యాచ్ ల్లో  ఆల్ ఔటై  బంగ్లాదేశ్ ఈజాబితాలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 


ఇక రెండో టీ20 లో కూడా శ్రీలంక  చిత్తుగా ఓడిపోయింది. 118పరుగుల లక్ష్యాన్ని ఆసీస్  కేవలం  ఒక  వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో నే అలవోకగా ఛేదించింది. మొదటి మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిన  ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్  ఈ మ్యాచ్ లో  కూడా  60పరుగులతో  అజేయంగా  నిలువగా  స్టీవన్ స్మిత్ 53 పరుగులతో రాణించాడు. ఈవిజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల  సిరీస్ ను  2-0 తో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో మ్యాచ్ వచ్చే నెల 1 న జరుగనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: