భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త అవతారం ఎత్తే అవకాశాలున్నాయా? అంటే క్రీడా పరిశీలకులు అవుననే అంటున్నారు . వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ఓటమి అనంతరం ధోని తన వ్యక్తిగత పనులను చక్కబెట్టుకోవడం తోపాటు , కుటుంబంతోనే గడుపుతున్నాడు . క్రికెట్ ఫీల్డ్ కు దూరంగా ఉంటున్న ధోని , త్వరలోనే  క్రీడా వ్యాఖ్యాత గా అవతారం ఎత్తే అవకాశాలు  ఉన్నట్లు తెలుస్తోంది .


 భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ నెల 22  వతేదీ నుంచి కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న డే నైట్ మ్యాచ్ కు ధోని ని కామెంటరీ బాక్స్ లో కూర్చోబెట్టేందుకు బీసీసీఐ తో పాటు స్టార్ స్పోర్ట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . క్రికెట్ మైదానం లో కూల్ గా ఉంటూ జట్టును నడిపించిన ధోని , తన  కామెంటరీ ద్వారా క్రీడాభిమానులు ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి మరి . పలువురు స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే క్రీడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే . ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు , మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా గతం లో క్రీడా వ్యాఖ్యాతగా వ్యవహరించి , అభిమానులను తనదైన శైలిలో మెప్పించాడు .


ఇక సునీల్ గవాస్కర్ , రవిశాస్త్రి లు కామెంటేటర్లు గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు . ఇక ఇటీవల కాలం లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన పలువురు ఆటగాళ్లు క్రీడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు . ఇక ధోని కూడా వారి సరసన చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది .అన్ని అనుకున్నట్లు జరిగితే డే నైట్ టెస్టు మ్యాచ్ కు ధోని కామెంటరీ బాక్స్ లో దర్శనం ఇవ్వనున్నాడు .


మరింత సమాచారం తెలుసుకోండి: