టీ 20 క్రికెట్లో చిన్న చిన్న దేశాలు కూడా ఎన్నో రికార్డులు త‌మ ఖాతాలో వేసుకుంటున్నాయి. తాజాగా భార‌త్ ఆస్ట్రేలియా పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. ఇక ఈ 20 టీ ఫార్మాట్‌లో ఛేజింగ్ ప‌రంగా భార‌త్‌కు ఇది 41వ గెలుపు. మొత్తం టీ 20ల్లో భార‌త్ 61వ సార్లు టీమిండిచా ఛేజింగ్‌కు దిగగా 41 సార్లు గెలిచింది.


ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు 40 విజ‌యాల‌తో ఆసీస్ ఫ‌స్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు టీం ఇండియా ఆ రికార్డును బ్రేక్ చేసి 41 విజ‌యాల‌తో ముందు ఉంది. ఆసీస్ ఛేజింగ్‌ల ప‌రంగా 69 సార్లు సెకండ్‌ బ్యాటింగ్‌ దిగి 40 సార్లు గెలిచింది. ఈ క్ర‌మంలోనే టీం ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా పలు రికార్డులు బ్రేక్‌ చేశాడు. టీ 20 క్రికెట్ మ్యాచ్‌ల చ‌రిత్ర‌లో ఎక్కువ సిక్స‌ర్లు కొట్టిన (37 సిక్స‌ర్లు) కెప్టెన్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.


ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు మాజీ కెప్టెన్ ఎంఎస్‌.ధోనీ (34) పేరిట ఉండేది. ధోని 62 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సాధించగా, రోహిత్‌ కేవలం 17 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బ్రేక్‌ చేశాడు. 26 ఇన్నింగ్స్‌లో 26 సిక్సర్లతో విరాట్‌ కోహ్లి వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టిర‌కు టీ 20ల్లో కోహ్లీ 22 అర్ధ సెంచ‌రీలు చేయ‌గా.. ఇప్పుడు రోహిత్ కూడా 22 అర్ధ సెంచ‌రీలు చేసి కోహ్లీతో స‌మానంగా నిలిచాడు. ఇక కెప్టెన్‌గా టీ 20ల్లో కోహ్లీ 6 అర్ధ సెంచ‌రీలు చేయ‌గా... రోహిత్ కూడా 6 అర్ధ సెంచ‌రీల‌తో కోహ్లీతో స‌మానంగా నిలిచాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: