ధోని అభిమానులకు గుడ్ న్యూస్ .. ఇటీవల జరిగిన  వన్డే ప్రపంచ కప్ తరువాత  క్రికెట్ కు  తాత్కాలిక విరామం ప్రకటించిన  ధోని మళ్ళీ బ్యాట్ పట్టుకోనున్నాడు.  అన్ని కుదిరితే  వచ్చే ఏడాది  మార్చి లో  ధోని మళ్ళీ మైదానం లోకి అడుగు పెట్టనున్నాడు.  ఈమేరకు బంగ్లాదేశ్  క్రికెట్ బోర్డు  ,బీసీసీఐ  తో చర్చలు జరుపుతుంది. అదేంటి  ధోని రీ ఎంట్రీ కి బీసీబీ  , బీసీసీఐ  ను పర్మిషన్ కోరడం ఏంటని అనుకుంటున్నారా ? 

 
బంగ్లా క్రికెట్ బోర్డు  నిర్వహించే మ్యాచ్ ల ద్వారానే   ధోని  రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే  ఇదేదో బంగ్లా , భారత్ ల మధ్య జరిగే సిరీస్ కోసం కాదు.  ఏసియా ఎలెవన్  , రెస్ట్  అఫ్ ది  వరల్డ్  జట్ల  మధ్య వచ్చే ఏడాది  మార్చి 18, 21 న  రెండు టీ 20 మ్యాచ్ లు మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈమ్యాచ్ లకు బంగ్లా దేశ్  ఆతిథ్యం ఇవ్వనుంది.  అందులో భాగంగా  ఏసియా  ఎలెవన్  తరపున  ఆడడానికి భారత్ నుండి   7గురు  టీ 20 స్పెషలిస్టులను  తీసుకోవడానికి  బీసీబీ   , బీసీసీఐ అంగీకారం   కోరింది.  ధోని తో పాటు , కోహ్లీ , రోహిత్ శర్మహార్దిక్ పాండ్య , జడేజా , బుమ్రా , భువనేశ్వర్ కుమార్ లను  ఆడించాలని  బంగ్లా  , బీసీసీఐ ని కోరింది. 
 
 
ఇప్పటికే  ఈ మ్యాచ్ లకు  ఐసీసీ  కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   టీమిండియా తోపాటు  మిగితా  జట్ల లలోని  టాప్ ప్లేయర్స్ ను  ఈ సిరీస్  లో ఆడించాలని  cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బీసీబీ ఆయా జట్ల బోర్డులతో సంప్రదింపులు  జరుపుతుంది.  అన్ని కుదిరితే  ఈ సిరీస్ ద్వారా  ధోని మళ్ళీ మైదానం లోకి అడుగు పెట్టడం ఖాయంగా  కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: