మూడు మ్యాచ్ ల టీ 0సిరీస్ లో భాగంగా  భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం ముంబై లోని వాంఖడే  వేదికగా జరిగిన  చివరి  టీ 20మ్యాచ్ లో  67పరుగులతో భారత్  విజయం సాధించి 2-1 తో  సిరీస్ ను కైవసం చేసుకుంది. వరసగా మూడో సారి టాస్ ఓడిపోయి  బ్యాటింగ్ కు దిగిన  భారత్ .. నిర్ణీత 20ఓవర్లలో  240పరుగుల  భారీ స్కోర్  సాధించింది.  ఓపెనర్లు  రాహుల్ (91), రోహిత్ శర్మ (71) మెరుపులు మెరిపించగా  నాల్గో స్థానం లో వచ్చిన  కెప్టెన్ కోహ్లి (70*) విండీస్ బౌలర్ల కు చుక్కలు చూపెట్టాడు.  దాంతో  భారత్  ఓవర్ కు 12 రన్ రేట్ తో  పరుగులు సాధించింది. 
 
 
ఇక ఆ తరువాత  భారీ లక్ష్య ఛేదనకు  దిగిన  విండీస్ ఆదిలోనే  మూడు  వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో  హేట్మెయర్ , పోలార్డ్  ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. క్రమక్రమంగా  దూకుడు పెంచుతూ  టెంక్షన్ పెటించిన  ఈ జోడీని కుల్దీవ్  యాదవ్ విడదీశాడు. 10ఓవర్ లో  కుల్దీప్ బౌలింగ్ లో మొదటి రెండు బంతులను  సిక్సర్లగా మలిచిన  హేట్మెయర్(41)  మూడో బంతిని అలానే  స్టాండ్స్ లోకి తరలించే క్రమంలో  లాంగ్ ఆన్ వద్ద  రాహుల్  కు చిక్కాడు. ఆ ఆతరువాత  కాసేపు  పోలార్డ్ సిక్సర్ల తో హోరెత్తించాడు. అయితే అదే క్రమంలో భువనేశ్వర్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి  పోలార్డ్(68)  జడేజా  కు  క్యాచ్ ఇచ్చాడు . దాంతో  విండీస్  ఓటమి  ఖరారైంది. తరువాత వచ్చిన  బ్యాట్స్ మెన్ తరువాత వచ్చిన  బ్యాట్స్ మెన్  ప్రతిఘటించలేకపోవడంతో  విండీస్ 20ఓవర్లలో  8వికెట్ల నష్టానికి  173పరుగులు చేసింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రాహుల్  కు  మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా కోహ్లిని  మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: