అలీమ్‌ దార్‌ పాకిస్తాన్‌కు చెందిన అంపైర్‌ ఇతడు ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అలీమ్‌ దార్‌  అంపైర్‌గా టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు బాధ్యతలు నిర్వర్తించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. తద్వారా అలీమ్‌ దార్‌ ఇప్పటివరకూ వెస్టిండీస్‌ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌ పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్‌ రికార్డును బ్రేక్‌ చేశారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌కు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య పెర్త్‌లో జరుగుతున్నది . దీనికి అంపైర్‌గా చేయడం ద్వారా అలీమ్‌ దార్‌ ఈ రికార్డును నెలకొల్పారు.  

 

అలీమ్‌ దార్‌  207 వన్డేలకు, 46 అంతర్జాతీయ టీ20లకు అంపైర్‌గా పని చేసినవారు దింతో  ఇది 129వ టెస్టు మ్యాచ్‌ అంపైరింగ్‌ కావడం గొప్ప విశేషం. 128 టెస్టులకు 181 వన్డేలకు అంపైర్‌గా 1989-2009 మధ్య కాలంలో బక్నర్‌   పని చేశారు. కాగా,  ఇంకా రెండు మ్యాచ్‌లు దూరంలో వన్డేల్లో అంపైరింగ్‌ రికార్డును అందుకోవడానికిఅతి తక్కువ దూరంలో  దార్‌ ఉన్నారు .  209 వన్డేలకు దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్టెజన్‌ అంపైర్‌గా చేసి తొలి స్థానంలో ఉన్నారు.

 

దశాబ్దానికి పైగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ పాకిస్తాన్‌లో ఆడిన 51 ఏళ్ల అలీమ్‌ దార్‌..  2003లో తన ఆన్‌ ఫీల్డ్‌ అంపైరింగ్‌ కెరీర్‌ను ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఢాకాలో జరిగిన మ్యాచ్‌ ద్వారా ఆరంభించారు. అలీమ్‌ దార్‌ తన తాజా ఘనతపై  మాట్లాడుతూ.. ‘  నేను అంపైరింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టే సమయానికి నేను దీన్ని సాధిస్తానని అనుకోలేదు.

 

ఇది  ఒక మైలురాయి నా అంపైరింగ్‌ కెరీర్‌లో అని చెప్పారు . ఎన్నోవేల మైళ్ల ప్రయాణంలో ఇదొక తీపి జ్ఞాపకం. ఎన్నో ఘనతలు  నా ప్రయాణంలో చూశా.   బ్రియాన్‌ లారా అజేయం టెస్టు ఫార్మాట్‌లో  400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు 2006లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 434 పరుగుల వన్డే లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజింగ్‌ చేయడం కూడా చూశా’ అని ఆయన వ్యక్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: