పొట్టి క్రికెట్  లీగ్..  ఐపీఎల్  2020  సీజన్ కోసం జరుగనున్న వేలానికి రంగం సిద్దమైంది.   ఈరోజు కోల్ కత్తా లో మధ్యాహ్నం 2:30 గంటలనుండి ఈ వేలం పక్రియ జరుగనుంది.  ఎనిమిది  జట్లలో మొత్తం  73 బెర్తుల కోసం ఈ వేలంను  నిర్వహించనున్నారు.  మొత్తం  332 మంది  ఆటగాళ్లు ఈ వేలంలో  అందుబాటులో వుండనుండగా ఇందులో 186 మంది భారత ప్లేయర్లు కాగా  మిగితా వారు విదేశీ ప్లేయర్లు వున్నారు. ఎనిమిది జట్లలో  29 బెర్తుల కోసం  విదేశీ ఆటగాళ్లు  పోటీపడనున్నారు. ప్రస్తుతం ఎనిమిది ప్రాంఛైజీల దగ్గర  మొత్తం  200కోట్లు వున్నాయి. వీటిని  ఆ 73 మంది ఆటగాళ్ల కోసం  వినియోగించనున్నారు. 
 
 
ఇక మొత్తం 15మంది  అత్యధిక బేస్ ప్రైస్ తో   ఈ వేలానికి   అందుబాటులో ఉండనున్నారు. వారిలో  పాట్ కమ్మిన్స్ , మాక్స్ వెల్ , క్రిస్ లిన్ , మిచెల్ మార్ష్ , డెల్ స్టెయిన్ ,జోష్ హాజెల్ వుడ్ ,ఏంజెలో మాథ్యూస్‌, ఇయాన్ మోర్గాన్ లు  2కోట్ల  బేస్ ప్రైస్ తో  పోటీలో ఉండగా  జాసన్ రాయ్ , రాబిన్ ఉతప్ప , డేవిడ్ విల్లీ , కైల్ అబాట్ , కేన్ రిచర్డ్ సన్ , క్రిస్ వోక్స్ , క్రిస్ మోరిస్ , షాన్ మార్ష్  లు 1.5కోట్ల బేస్ ప్రైస్ తో అందుబాటులో ఉండనున్నారు.  అయితే వీరిలో మాత్రం ఫ్రాంచైజీల కన్ను   కమ్మిన్స్ , మాక్స్ వెల్ , మోర్గాన్ , క్రిస్ లిన్ ,జాసన్ రాయ్ లపైనే వుంది. ఎంత ధరైనా పెట్టి వీరిని దక్కించుకోవడానికి  రెడీ అవుతున్నాయి.  వీరు మాత్రమే  కాకుండా  తక్కువ  బేస్  ప్రైస్ కలిగిన ఆటగాళ్లు హెట్మెయర్(వెస్టిండీస్), టామ్ బంటన్(ఇంగ్లాండ్)వంటి హిట్టర్లను  సొంతం చేసుకోవడానికి కూడా   ప్రాంఛైజీలు ఎంతైనా కుమ్మరించడానికి సిద్ధంగా వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: